DCW Chief: మహిళలవైపో రేపిస్టులవైపో చెప్పండి.. హర్యానా సీఎంపై ఢిల్లీ మహిళా చీఫ్ సంచలన వ్యాఖ్యలు

మరొక ట్వీట్‭లో పొడవాటి కత్తితో కేక్ కట్ చేస్తున్న గుర్మీత్ బాబా వీడియోను షేర్ చేస్తూ ‘‘ఖట్టర్ జీ.. మీరు సమాజంలో బహిరంగంగా వదిలిపెట్టిన రేపస్ట్, ఈ వ్యవస్థను ఎలా హేళన చేస్తున్నాడో చూడండి. ఒకప్పుడు బలహీనులను ఇవే కత్తులతో మహావీరులు రక్షించేవారు. ఇప్పుడు ఆ కత్తులతోనే రేపిస్టులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు కావాలి. కానీ ఇక్కడి ప్రభుత్వం ఆ నేరస్థుల కాళ్ల దగ్గరే ఉంది’’ అని ట్వీట్ చేశారు.

DCW Chief: మహిళలవైపో రేపిస్టులవైపో చెప్పండి.. హర్యానా సీఎంపై ఢిల్లీ మహిళా చీఫ్ సంచలన వ్యాఖ్యలు

CM Khattar should clear his stand on Ram Rahim: DCW chief

DCW Chief: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‭లాల్ కట్టర్‭పై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం కేసులో అరెస్టై జైలుకు వెళ్లి ఈ మధ్యే బెయిల్ మీద బయటికి వచ్చిన రాం రహీం బాబాతో ఆయన సమావేశం కావడాన్ని ఆమె తప్పుపట్టారు. అయితే గతంలోనే రాం రహీం బాబాతో తమకు సంబంధం లేదని చెప్పిన వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. ముఖ్యమంత్రి మహిళల పక్షమున్నారో రేపిస్టుల పక్షాన ఉన్నారో బహిరంగంగా స్పష్టం చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు.


ఈ విషయమై రెండు వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె షేర్ చేశారు. మొదటి వీడియోలో హర్యానా సీఎం ఓఎస్‭డీ, రాజ్యసభ ఎంపీ రాం రహీం బాబాతో మాట్లాడుతున్న వీడియో షేర్ చేస్తూ ‘‘రేపిస్ట్, రక్తపాతకుడు అయిన రాం రహీం బాబా దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. హర్యానా సీఎం ఓఎస్‭డీ సహా రాజ్యసభ ఎంపీ వీడియో కాల్ ద్వారా రహీమ్ బాబాతో మాట్లాడుతున్నారు. మీకు ఇలాంటి వారితో సంబంధం లేదని చెప్తే పని చేయదు. మీరు రేపిస్టుల వైపు ఉంటారో, మహిళలవైపు ఉంటారో బహిరంగంగా స్పష్టం చేయండి’’ అని ట్వీట్ చేశారు.


ఇక మరొక ట్వీట్‭లో పొడవాటి కత్తితో కేక్ కట్ చేస్తున్న గుర్మీత్ బాబా వీడియోను షేర్ చేస్తూ ‘‘ఖట్టర్ జీ.. మీరు సమాజంలో బహిరంగంగా వదిలిపెట్టిన రేపస్ట్, ఈ వ్యవస్థను ఎలా హేళన చేస్తున్నాడో చూడండి. ఒకప్పుడు బలహీనులను ఇవే కత్తులతో మహావీరులు రక్షించేవారు. ఇప్పుడు ఆ కత్తులతోనే రేపిస్టులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు కావాలి. కానీ ఇక్కడి ప్రభుత్వం ఆ నేరస్థుల కాళ్ల దగ్గరే ఉంది’’ అని ట్వీట్ చేశారు.

Rahul Gandhi: సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎలాంటి ఆధారాలు అక్కర్లేదు.. దిగ్విజయ్ వ్యాఖ్యలు సరికాదు: రాహుల్ గాంధీ