వాహ్ : బ్యాలెట్ బాక్సులు మోసిన లేడీ కలెక్టర్

వాహ్ : బ్యాలెట్ బాక్సులు మోసిన లేడీ కలెక్టర్

నిల్చొని చేయించాల్సిన పనిని.. అంతా తానై అన్నీ చేసుకోవడం ఎవరైనా చూశారా.. ప్రభుత్వం పని అంటే ఫార్మాలిటీగా పూర్తి చేసే అధికారులు ఉన్న కాలంలో కోరి పని నెత్తినేసుకునే కలెక్టర్‌ని చూస్తే వాహ్ అనాల్సిందే. 

కేరళ రాష్ట్రంలోని కూర్కెంచి జిల్లాలో కలెక్టర్ అనుపమ థ్రిస్సూర్ సిటీలో డ్యూటీ ప్రకారం.. బ్యాలెట్ బాక్స్ భద్రపరిచేందుకు వచ్చింది. ఓ పక్క లారీలో బాక్స్‌లు కిందకి దించుతున్నారు. వాటిని దించేందుకు సిబ్బంది తక్కువవడంతో పని త్వరగా జరగాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్ అనుపమ ఓ చేయి వేశారు. 
Also Read : ఇంటర్ బోర్డు లీలలు : ఫస్టియర్‌లో జిల్లా టాపర్, సెకండియర్‌లో తెలుగులో ఫెయిల్

ఓటింగ్ మెషీన్‌లు ఉన్న బ్యాక్సులు కూడా మోసుకెళుతున్న వీడియోను అక్కడే ఉన్నవారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో అది వైరల్‌గా మారిపోయింది. పబ్లిక్‌కు ఆమె అందిస్తున్న సేవలు, సింప్లిసిటీకి వేల కొద్ది కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు.