Complaint filed Against IT Minister : ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో పూజలు చేస్తారా? అంటూ మంత్రిపై పిటీషన్..CM క్షమాపణ చెప్పాలని డిమాండ్..

ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో పూజలు చేస్తారా? హిందువలు మనోభావాలను దెబ్బతీస్తారా? అంటూ బిహార్‌ ఐటీ మంత్రి మొహమ్మద్‌ ఇజ్రాయెల్‌ మన్సూరీ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ముజఫర్ పుర్ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

Complaint filed Against IT Minister : ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో పూజలు చేస్తారా? అంటూ మంత్రిపై పిటీషన్..CM క్షమాపణ చెప్పాలని డిమాండ్..

Complaint filed Against IT Minister

Complaint filed Against Bihar Muslim Minister : భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశంగా ప్రపంచ వ్యాప్తంగా పేరొందింది. హిందూ ముస్లి భాయీ భాయీ అనే నినాదం భారత్ సొంతం. కానీ కొంతమంది మతోన్మాదులు మాత్రం ఇంకా హిందువులు..ముస్లింలు అంటూ భేధాలు సృష్టిస్తున్నారు. భగవంతుడు అందరికి ఒక్కడే అనే భావనను కూడా వివాదంగా మారస్తున్నారు. ఓ ముస్లిం మంత్రి హిందూ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు కావటం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో పూజలు చేస్తారా? అంటూ బిహార్‌ ఐటీ మంత్రి మొహమ్మద్‌ ఇజ్రాయెల్‌ మన్సూరీ ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయాన్ని సందర్శించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని..ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ముజఫర్ పుర్ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మన్సూరీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ముజఫరపుర్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రకిశోర్‌ పరాశర్‌ పిటిషన్‌ వేశారు.

కాగా..ఇటీవల కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం నీతీశ్‌ కుమార్‌తో కలసి మన్సూరీ గయలోని విష్ణుపాద్‌ దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. దీనిపై చంద్రకిశోర్ పరాశర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..మంత్రి పై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. సనాతన దర్మాన్ని ఆచరించేవారికే ఆ ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉందని.. దాన్ని ఉల్లంఘించినందుకు మన్సూరీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ముజఫరపుర్‌కు చెందిన చంద్రకిశోర్‌ పరాశర్‌ పిటిషన్‌ వేశారు. ఈ ఫిర్యాదు ఐపిసి 295, 295 ఎ మరియు 504లోని వివిధ సెక్షన్ల కింద దాఖలు చేయబడిందని సెప్టెంబరు 2న విచారణ జరుపుతుందని అతడి తరఫు న్యాయవాది తెలిపారు.

గయలోని విష్ణుపాద దేవాలయంలోకి హిందూయేతర భక్తుల ప్రవేశం అనుమతిలేదు. “హిందువేతరుల ప్రవేశం నిషిద్ధం” అనే ఏర్పాటు చేసింది దేవాయలం నిర్వాహకుల కమిటీ. 100 సంవత్సరాలుగా ఈ నియమం అమలులో ఉంది. ఈక్రమంలో బీహార్ ఐటీ మంత్రి మహ్మద్ ఇస్రాయిల్ మన్సూరీ అనే హిందువేతర వ్యక్తితో కలిసి నితీష్ కుమార్ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడం పెద్ద వివాదానికి దారితీసింది. బీహార్ సీఎం మన్సూరితో పాటు ఇతర నేతలతో కలిసి గర్భగుడిలో ప్రార్థనలు చేశారు. హిందువులను ఉద్దేశపూర్వకంగా అవహేళన చేసినందుకు క్షమాపణలు చెప్పాలని బీహార్ బీజేపీ చీఫ్ ఎస్ జైస్వాల్ బీహార్ సీఎంను డిమాండ్ చేశారు.

”గర్భ్ గృహంలోకి హిందూయేతరుల ప్రవేశానికి అనుమతి లేదని సీఎం నితీష్ కుమార్‌కు తెలుసు. హిందువులను అవహేళన చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేశారు అంటూ ఆరోపించారు. ఇది కుట్రలో భాగమే. హిందువుల మనోభావాలు దెబ్బతీసినిందుకు సీఎం క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. హిందువుల మత మనోభావాలను దెబ్బతీసినందుకు నితీష్ కుమార్ క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ డిమాండ్ చేశారు. కాగా ఇటీవల నితీశ్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.