Congress vs BJP: విదేశాల్లో రాజకీయాలొద్దన్న విదేశాంగ మంత్రి జైశంకర్‭కు గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

"ప్రధానమంత్రి గత ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. దేశంలోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రపై విదేశాల్లో ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది కేవలం మన రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని మాత్రమే" అని సుర్జేవాలా అన్నారు.

Congress vs BJP: విదేశాల్లో రాజకీయాలొద్దన్న విదేశాంగ మంత్రి జైశంకర్‭కు గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

Politics: విదేశాల్లో రాహుల్ గాంధీ రాజకీయాలు మాట్లాడుతున్నారని, దేశ అంతర్గత విషయాలను విదేశీ గడ్డపై చర్చించడం ఏంటంటూ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ గట్టిగా తిప్పి కొట్టింది. విదేశాల్లో భారత రాజకీయాల గురించి మాట్లాడటం ప్రారంభించింది జయశంకర్‭కు మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తేనని (ప్రధానమంత్రి మోదీ) కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ ఘాటుగా సమాధానం చెప్పారు.

Kolhapur Clashes: యూపీలో చేసినట్టే వారిని కూడా కాల్చిపారేయాలి.. కొల్హాపూర్ అల్లర్లపై సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు

విదేశాల్లో భారతదేశాన్ని విమర్శించడం, దేశ రాజకీయాలపై చర్చించడం లాంటివి అలవాటయ్యాయంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి జైశంకర్ విమర్శించారు. విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు జైశంకర్‌ మాట్లాడుతూ ‘‘భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది లేదు. అయితే అంతర్గత సమస్యలపై విదేశాల్లో చర్చించడం సరికాదు’’ దేశ రాజకీయాలను దేశం వెలుపలికి తీసుకెళ్లడం దేశ ప్రయోజనాల కోసం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రతిదాడి చేశారు. మోదీ 2014కి ముందే ఈ తరహా ప్రచారం ప్రారంభించారని అన్నారు.

Minister Harish rao : మెడికల్ కాలేజీలు మేం ఏర్పాటు చేస్తే ..అది బీజేపీ ఘనత అని చెప్పుకోవటం సిగ్గు చేటు..

జయశంకర్ విమర్శలపై జైరాం తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ “జాతీయ రాజకీయాలను దేశం వెలుపలికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి మరెవరో కాదు, మీకు (జైశంకర్) మంత్రి పదవిని ఇచ్చిన వ్యక్తే. ఈ విషయం మీకు కూడా తెలుసు. కానీ మీరు దానిని గుర్తించలేరు’’ అని ట్వీట్ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రికి భారతీయ జనతా పార్టీ పాత స్క్రిప్ట్ ఇచ్చిందని, అతను కొత్తదాన్ని చదవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. “ప్రధానమంత్రి గత ప్రభుత్వాలను ఎగతాళి చేశారు. దేశంలోని 70 ఏళ్ల రాజకీయ చరిత్రపై విదేశాల్లో ప్రసంగాలు చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది కేవలం మన రాజ్యాంగ సంస్థలపై ప్రణాళికాబద్ధమైన దాడి జరుగుతోందని మాత్రమే” అని సుర్జేవాలా అన్నారు.