కర్నాటక పొలిటికల్ హీట్ : సిద్ధరామయ్యకు మెర్సిడెజ్ బెంజ్ గిఫ్ట్

  • Published By: madhu ,Published On : January 21, 2019 / 01:38 AM IST
కర్నాటక పొలిటికల్ హీట్ : సిద్ధరామయ్యకు మెర్సిడెజ్ బెంజ్ గిఫ్ట్

కర్నాటక : రాష్ట్రంలో ఇంకా రాజకీయ సంక్షోభం క్లోజ్ కాలేదు కానీ మరో ఆసక్తికర అంశం మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. అదే మాజీ సీఎం అయిన సిద్ధరామయ్యకు అందిన ఓ గిఫ్ట్‌ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే హెబ్బల్ బైరది సురేష్…మెర్సిడెజ్ బెంజ్ కారును బహుమతిగా ఇవ్వడం సంచలనం కలిగిస్తోంది. ప్రస్తుతం కర్నాటకలో రాజకీయాలు వేడెక్కిన తరుణంలో ఈ గిఫ్ట్ ఆయన ఎందుకు ఇచ్చారు అనే కొశ్చన్ అందరిలోనూ మెలుగుతోంది. కానీ ఇది గిఫ్ట్ కాదంటూ సిద్ధరామయ్య పేర్కొంటున్నారు. 
గతంలో సిధ్దరామయ్య ఖరీదైన కార్లు..వాచ్‌లు బహుమతులు గానో, ధరించారంటూ గతంలో ఆరోపణలున్నాయి. 2018 జూన్‌లోనూ ఇలానే కేజే జార్జ్ అనే మంత్రి, సిధ్దరామయ్యకి టయోటా లాండ్ క్రూజర్ బహూకరించారు అది కూడా ఏడాది పాటు పెట్రోల్ కూపన్లతో సహా..ఇప్పుడు ఎమ్మెల్యే సురేష్ మాజీ సిఎంకి ఇలా ఎందుకు భారీ కానుక ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. 

  • మాజీ సిఎం సిద్దరామయ్యకి మెర్సిడెస్ బెంజ్ బహుమతి
  • మెర్సిడెస్ బెంజ్‌ను బహూకరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బైరది సురేష్
  • ఖరీదైన కార్లు, వాచ్‌లు కానుకలుగా తీసుకోవడంపై సిద్దూపై విమర్శలు 
  • 2018లో టయోటో లాండ్ క్రూజర్ బహుమతి
  • రిసార్ట్ రాజకీయాల నేపధ్యంలో తాజా బహుమతిపై కర్నాటకలో ఆసక్తి