Siddaramaiah : ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల వ్యూహం కన్నా, ముఖ్యమంత్రి ఎంపికకే ఎక్కువ కష్టపడి ఎట్టకేలకు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Siddaramaiah : ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య

Siddaramaiah (1)

Karnataka CM Siddaramaiah : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ముందుగా ఊహించినట్టు సిద్ధరామయ్యనే సీఎం పదవి వరించింది. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల్లో అధిష్టానం పెద్దలు ఇద్దరు నేతలను ఒప్పించినట్టుగా తెలుస్తోంది. అయితే, అధిష్టానం ముందు డీకే శివకుమార్ నాలుగు డిమాండ్లు ఉంచారు.

ఒకటో డిమాండ్.. తాను మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉండాలి, రెండో డిమాండ్.. మూడేళ్లు తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, మూడో డిమాండ్.. మొదటి రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలి, నాలుగో డిమాండ్.. పీసీసీ చీఫ్ గా తననే కొనసాగించాలి.. అని డికే శివకుమార్ స్పష్టం చేశారు. మే20వ తేదీన బెంగళూరులో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. మరోవైపు బెంగళూరులో గురువారం రాత్రి 7 గంటలకు మరోసారి సీఎల్పీ సమావేశం జరుగనుంది.

Karnataka Polls: 15 సార్లు ఎన్నికలు, 3 సార్లే పూర్తి స్థాయి ప్రభుత్వాలు.. కర్ణాటకలో ఈసారైనా 5ఏళ్ల ప్రభుత్వం వచ్చేనా?

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల వ్యూహం కన్నా, ముఖ్యమంత్రి ఎంపికకే ఎక్కువ కష్టపడి ఎట్టకేలకు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల సుదీర్ఘ మంతనాలు జరిపిన తర్వాత సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది.

కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే.. రాహుల్ గాంధీతోపాటు ఇద్దరు సీఎం అభ్యర్థులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లతో రాత్రి వరకు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య పవర్ షేరింగ్ కు అధిష్టానం ఒప్పించినట్లు తెలుస్తోంది. తొలుత రెండేళ్లు సిద్ధరామయ్య సీఎంగా ఉండనున్నారు.. తర్వాత ముడేళ్లు డీకే శివకుమార్ కు సీఎంగా అవకాశం ఇవ్వనున్నారు. డీకే శివకుమార్ కు అధిష్టానం రెండు ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Congress: “కర్ణాటక” వ్యూహంతో తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో గెలవాలని కాంగ్రెస్ నిర్ణయం.. ఇవి ప్రకటించే అవకాశం..

డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం దాంతోపాటు ఇప్పుడున్న పీసీసీ చీఫ్ కొనసాగించడం, అదనంగా ఆయన కోరుకున్న శాఖలు కట్టబెట్టడం.  కాంగ్రెస్ లో ఒకే పదవి నిబంధనను పక్కబెట్టి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనను తెచ్చినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీని ప్రకారం సిద్ధరామయ్య తొలుత రెండేళ్లపాటు సీఎంగా ఉండనున్నారు.. ఆపై మిగిలిన మూడేళ్ల కాలానికి డీకే శివకుమార్ సీఎంగా కొనసాగుతారు.