Uttarakhand : ఫోన్‌లో మాట్లాడుతూ సీఎంకు శాల్యూట్… ఏఎస్పీపై బదిలీ వేటు

ఫోనులో మాట్లాడుతూనే సాక్షాత్తూ ముఖ్యమంత్రికే నిర్లక్ష్యంగా శాల్యూట్ చేసిన ఏఎస్పీపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన ఉదంతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ముఖ్యమంత్రి తన హెలికాప్టర్ నుంచి దిగగానే, కోట్‌ద్వార్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) శేఖర్ సుయాల్ ఫోన్‌లో మాట్లాడుతూనే ఆయనకు సెల్యూట్ చేశారు....

Uttarakhand : ఫోన్‌లో మాట్లాడుతూ సీఎంకు శాల్యూట్… ఏఎస్పీపై బదిలీ వేటు

Uttarakhand Chief Minister

Updated On : August 18, 2023 / 7:00 PM IST

Uttarakhand ASP : ఫోనులో మాట్లాడుతూనే సాక్షాత్తూ ముఖ్యమంత్రికే నిర్లక్ష్యంగా శాల్యూట్ చేసిన ఏఎస్పీపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన ఉదంతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కోట్‌ద్వార్ (Kotdwar) విపత్తు ప్రాంతాలను సందర్శించేందుకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ హెలికాప్టరులో వచ్చారు. ముఖ్యమంత్రి తన హెలికాప్టర్ నుంచి దిగగానే, కోట్‌ద్వార్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) శేఖర్ సుయాల్ ఫోన్‌లో మాట్లాడుతూనే ఆయనకు సెల్యూట్ చేశారు. (Cop transferred for saluting Uttarakhand Chief Minister while on phone) సీఎంకు ఫోనులో మాట్లాడుతూనే శాల్యూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Vistara flight : ఢిల్లీ విమానాశ్రయంలో విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

దీంతో ఉన్నతాధికారులు ఏఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కార్యక్రమంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ ఏఎస్పీ శేఖర్ సుయాల్ ను నరేంద్రనగర్ లోని పోలీసు శిక్షణ కేంద్రానికి బదిలీ చేశారు. ఈ సంఘటన ఆగస్టు 11న కోట్‌ద్వార్‌లో ముఖ్యమంత్రి హరిద్వార్ నుంచి హెలికాప్టర్‌లో గ్రాస్తాన్‌గంజ్ హెలిప్యాడ్‌కు వచ్చినప్పుడు జరిగింది.

Manipur violence : మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ… ముగ్గురి మృతి

సీఎం రాక గురించి తెలియగానే స్థానిక అధికారులు హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు పరుగెత్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారి ఒక చేత్తో ఫోన్ చెవిలో పెట్టుకుని మరో చేత్తో ముఖ్యమంత్రికి శాల్యూట్ చేశారు. శేఖర్ పై బదిలీ వేటు వేయడంతో కొత్త అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా జై బలూని కోట్‌ద్వార్‌లో నియమితులయ్యారు.