Corona Cases : భారత్ లో కొత్తగా 41,806 కరోనా కేసులు 581 మృతి

దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 41,806 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Corona Cases : భారత్ లో కొత్తగా 41,806 కరోనా కేసులు 581 మృతి

Corona Cases (3)

Corona Cases : దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 41,806 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇదే సమయంలో 581 కొత్త మరణాలు సంభవించడంతో, మరణించిన వారి సంఖ్య ఇప్పుడు 4,11,989 గా ఉందని తెలుస్తుంది . గత 24 గంటల్లో దేశంలో 39,130 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు . దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,01,43,850 కు చేరుకుంది.

క్రియాశీల కేసుల సంఖ్య 4,32,041 కు పడిపోయింది. ఇక యాక్టీవ్ కేసుల రేటు 1.39% గా ఉంది. ఇక ఇప్పటివరకు 43.80 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో 39,13,40,491 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో 34,97,058 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 97.28% గా ఉంది.

ఇక గడిచిన 24 గంటల్లో 19,43,488 శాంపిల్స్ పరీక్షించారు వైద్య సిబ్బంది. కరోనా యాక్టీవ్ కేరళ, మహారాష్ట్రలోని అధికంగా ఉన్నాయి. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. ఇక యాక్టివ్ కేసులు అండమాన్ అండ్ నికోబర్ దీవుల్లో చాలా తక్కువగా ఉంది. ఇక్కడ 11 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.