corona in inida :దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ సంకేతాలు..కొత్తగా 42,618 కేసులు

కోవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చేసిందనే సంకేతాలు భారత్ లో కనిపిస్తోంది. రోజు రోజుకు భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే..

corona in inida :దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ సంకేతాలు..కొత్తగా 42,618 కేసులు

Corona 3rd Weve

corona in inida : కోవిడ్-19 థర్డ్ వేవ్ వచ్చేసిందనే సంకేతాలు భారత్ లో కనిపిస్తోంది. రోజు రోజుకు భారీగా పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే థర్డ్ వేవ్ సంకేతాలే కాదు క్లియర్ అనిపిస్తోంది. కోవిడ్-19 మొదటివేవ్ లో పలు మరణాలతో భయాన్ని పరిచయం చేసి మహమ్మారి..సెకండ్ వేవ్ లో భారీగా ప్రాణాల్ని పొట్టనపెట్టుకుంది. కోవిడ్ మరణాలతో ఖననాలు చేయటానికి కూడా స్థలాలు చాలనంతగా మరణాల సంఖ్య పెరిగిపోయి తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కరోనా అనే మాట వింటేనే హడలిపోయే పరిస్థితులు కల్పించింది. ఇప్పుడు థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చిందా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు సంఖ్య చూస్తే..ఎందుకంటే రోజువారి కేసులు గత వారం క్రితం చూస్తే చాలా స్వల్పంగా నమోదయ్యాయి. కానీ గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంట్లో భాగంగా నిన్న ఒక్కరోజే ఏకంగా కొత్తగా 42,618 క‌రోనా కేసులు నమోదయ్యాయి.దీన్ని బట్టి చూస్తే థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయిందనే అనిపిస్తోంది.

రోజు రోజుకి కోవిడ్ ఆర్​-ఫ్యాక్టర్​ సంఖ్య పెరుగుతోంది.1.20కి చేరువలో ఆర్​-ఫ్యాక్టర్​ సంఖ్య ఉంది. దేశంలో థర్డ్​వేవ్​ హెచ్చరికలు జారీ చేసినప్పుడు 1.03గా ఉన్న ఆర్​-ఫ్యాక్టర్​ సంఖ్య..ఇప్పుడు ఆందోళనకరస్థాయిలో ఉంది. కేరళ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఆందోళకర స్థాయిలో
ఆర్​-ఫ్యాక్టర్​ సంఖ్య పెరుగుతోంది. కేరళ, మహారాష్ట్ర, మిజోరం, జమ్ముకశ్మీర్​,ఏపీలో కరోనా వ్యాప్తితో బాగా పెరుగతోంది. ముఖ్యంగా కేరళలో మరింతగా కేసులు సంఖ్య పెరుగుతోంది.

కేరళలో 1.33, మిజోరంలో 1.36, జమ్ముకశ్మీర్​ 1.25, మహారాష్ట్ర 1.06 సహా ఆంధ్రప్రదేశ్​లో 1.09గా ఆర్​-ఫ్యాక్టర్​ సంఖ్యగా ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో మార్చి నుంచి మే నెలల మధ్య అత్యధిక సంఖ్యలో నమోదైన ఆర్-​ ఫ్యాక్టర్​..మార్చి 9 నుంచి ఏప్రిల్​ 21 మధ్య 1.37గా ఉంది.

ఈ క్రమంలో శుక్రవారం (సెప్టెంబర్ 3,2021) కొత్తగా 42,618 క‌రోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,45,907కి చేరింది. అలాగే..శుక్రవారం 36,385 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 330 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,39,895కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,21,00,001 మంది కోలుకున్నారు. 4,40,225 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 67,72,11,205 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క రోజే 58,85,687 డోసులు వేశారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 29,322 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 131 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా..సెకండ్ వేవ్ పూర్తిగా ముగియకుండానే థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి. దీంతో ప్రజలు మరింత జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. ముఖ్యంగా జనాలు గుడిగూడి చేసుకునే పండుగ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రానున్న వినాయక చవితి పండుగ విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలని అటు అధికారులు సూచిస్తున్నారు. అలాగే నిపుణులు కూడా కరోనా వ్యాప్తికి పండుగలు కారణం కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.