కరోనా భయంతో కన్న తల్లి శవాన్ని కూడా కాదన్నారు!!

10TV Telugu News

కొవిడ్-19 భయంతో కన్నతల్లి శవాన్ని కూడా తమకు సంబంధం లేదని వదిలేశారు. 69ఏళ్ల మహిళ ఆదివారం సాయంత్రం ఇన్ఫెక్షన్ సోకి లూధియానాలోని ఫోర్టిస్ హాస్పిటల్ లో కన్నుమూసింది ఫ్యామిలీ ఆ శవం దగ్గరకు రాకపోవడమే కాదు.. ప్రభుత్వం నిర్వహిస్తున్న అంత్యక్రియల్లో సైతం భాగం కాలేదు. పలుమార్లు ఆ మహిళ కుటుంబానికి రిక్వెస్ట్ లు పంపి స్పందించకపోవడంతో అడ్మినిస్ట్రేషనే అంత్యక్రియలు పూర్తి చేసింది. 

తహశీల్దార్ కమ్ సబ్ రిజిష్ట్రార్ అయిన జాగ్సీర్ సింగ్ కుటుంబాన్ని అడిగి అడిగి రెస్పాన్స్ లేకపోవడంతో స్మశానంలో వారే అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబంలోని ముగ్గురు సభ్యులుకు పలు మార్లు ఫోన్ చేసి.. కూతురు, అల్లుడు కూడా స్పందించలేదు. చివరికి కూతురు, అల్లుడు కార్లో స్మశానం బయటే ఉండి అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ ఉండి వెళ్లిపోయారు. 

ఈ ఘటన గురించి విని మేం షాక్ అయ్యాం. కొద్ది గంటల వరకూ ఫోర్టిస్ హాస్పిటల్ లో ఉన్న డెడ్ బాడీ మాదేనని ఎవ్వరూ రాలేదు. దాదాపు బిల్లు రూ.3.5లక్షలు అయింది. అది కూడా కట్టాల్సిన అవసర్లేదని హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. అడ్మినిష్ట్రేషన్ బిల్లు కడుతుందని.. డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చినా కుటుంబ సభ్యులు రాలేదు. 

సాయంత్రం 5గంటల వరకూ కుటుంబ సభ్యులు వస్తారని వెయిట్ చేసి హాస్పిటల్ కు రాకపోవడంతో నేనే వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేయాలనుకున్నా. స్మశానానికి తీసుకెళ్లి కూడా మహిళ ఉండే సిమ్లాపురి ప్రాంతానికి సమాచారం అందించాం. కుటుంబాన్ని మరోసారి పిలిచి వారి కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. వారితో ఓ డాక్టర్ మాట్లాడి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. డెడ్ బాడీల నుంచి కరోనా సోకదని చెప్పినా నమ్మలేదు. 

రాత్రి 8గంటల 30నిమిషాలకు కుటుంబానికి చెందిన ముగ్గురు కారులో వచ్చి గేట్ బయటే ఆగిపోయారు. వారిని లోపలికి రావాలని కోరాం. అప్పటికీ ఆ శవం అంత్యక్రియలు అడ్మినిష్ట్రేషన్ చూసుకుంటుంది మాకు సంబంధం లేదని అన్నారు. అసలెవరో గుర్తులేని శవం అన్నట్లుగా వ్యవహరించారు. అన్ని ప్రయత్నాల తర్వాత రాత్రి 10గంటలకు ప్రభుత్వం సేవాదర్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. 

అతనికి పరిస్థితి చెప్పిన తర్వాత నో చెప్పలేదు. కరోనా వైరస్ కేసు అని చెప్పి సేఫ్టీ డ్రస్ వేసుకోవాల్సిందిగా సూచించాం. హాస్పిటల్ నుంచి వచ్చిన ఇద్దరు వర్కర్లు పైర్ మీద బాడీని ఉంచారు. మళ్లీ ఒకసారి పిలిచినా వారు రాలేదు. సేఫ్టీ సూట్ ఇస్తాం. శానిటైజ్ చేస్తాం. అని చెప్పాం. అయినా వారంతా దహనం చేసే స్థలానికి 100మీటర్ల దూరంలోనే ఉండిపోయారని అధికారులు అన్నారు. ఘటన గురించి తెలిసిన అధికారులంతా కరోనా భయంతో కన్నప్రేమను చంపుకోవడం పట్ల షాక్ అవుతున్నారు. 

Also Read | ఇండియన్ క్రికెటర్స్ ని పెళ్లి చేసుకున్న ఏడుగురు హీరోయిన్లు