Election Results : ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా..?
లుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమయ్యాక కొన్ని గంటల్లోనే ఫలితాలపై ప్రాథమిక అంచనాలు వెలువడతాయి.

5 States Assembly Election Results 2022 Live
దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. నేతల తలరాతను, భవితవ్యాన్ని డిసైడ్ చేస్తూ ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించేందుకు సర్వం సిద్ధమైంది. జాతీయ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఉత్తరప్రదేశ్‌తోపాటు.. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఐదు రాష్ట్రాల్లో దాదాపు 1,200 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇందుకోసం పటిష్ట ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
Read This : 5 States Election Results: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. కీలకాంశాలు
5 రాష్ట్రాలు, 690 నియోజకవర్గాలు, 6 వేల 944 మంది అభ్యర్థులు.. ఈ మెగా సెమీ ఫైనల్స్‌లో విజేతలెవరు? ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయా? 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ఉత్తరప్రదేశ్‌లో యోగి చరిత్ర తిరగ రాయబోతున్నారా? వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తారా ? యూపీలో మోదీ-యోగి మ్యాజిక్ పనిచేసిందా? యూపీలో కులాల సమీకరణాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? పంజాబ్‌లో మిగతా పార్టీలను ఊడ్చేస్తూ ఆప్ జెండా పాతబోతుందా? కేజ్రీవాల్ ప్రస్థానం ఢిల్లీ నుంచి పంజాబ్ వైపు సాగబోతోందా? ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో హోరాహోరీ తప్పదా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కాసేపట్లో సమాధానం రానుంది.
అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 750కిపైగా కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఈ రాష్ట్రాల్లో 50వేవల మందికిపైగా అధికారులను, 671 మంది కౌంటింగ్ పరిశీలకులు, 130 మంది పోలీసు పరిశీలకులు, 10 మంది స్పెషల్ పరిశీలకుల్ని నియమించారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. కరోనా లక్షణాలు కలిగిన వారినెవరినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించరు.
తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమయ్యాక కొన్ని గంటల్లోనే ఫలితాలపై ప్రాథమిక అంచనాలు వెలువడతాయి. సాయంత్రం లేదా రాత్రికల్లా ఐదు రాష్ట్రాల ఎన్నికల పూర్తి ఫలితాలు రానున్నాయి. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు విడతల్లో జరిగాయి. ఓట్ల లెక్కింపు జరగడానికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్‌లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈవీఎంల తరలింపు ప్రక్రియపై అభ్యంతరం తెలుపుతూ సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది. ఆ ముగ్గురి స్థానంలో కొత్త అధికారుల్ని నియమించింది. ఈవీఎంల తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో వారణాసి జిల్లా నోడల్ ఆఫీసర్‌గా ఉన్న జిల్లా అదనపు మెజిస్ట్రేట్ నళినీకాంత్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.