ఎన్-95 మాస్కు ఉన్నా ఆరడుగుల దూరం మస్ట్, అందరూ వాడితేనే 100శాతం ఫలితం

  • Published By: naveen ,Published On : July 9, 2020 / 12:42 PM IST
ఎన్-95 మాస్కు ఉన్నా ఆరడుగుల దూరం మస్ట్, అందరూ వాడితేనే 100శాతం ఫలితం

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా భయంతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే కోటిమందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. అంటే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం అన్న మాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండే మనకు శ్రీరామరక్ష అని చెబుతున్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఆ రెండు మస్ట్.

మాస్కుల భద్రత ఎంత?
మాస్కులు ధరిస్తే కరోనా సోకకుండా ఉంటుందనేది ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే చాలామంది రకరకాల మాస్కులు వాడుతున్నారు. కొందరైతే ఖరీదైన ఎన్‌-95 మాస్కుల్ని వాడుతున్నారు. కాగా, మాస్కుల భద్రత ఎంత? కరోనా రాకుండా ఎంతవరకు కాపాడతాయి? కొంతమంది మాత్రమే మాస్కులు వేసుకుంటే సరిపోతుందా? మాస్కు ఉంటే భౌతికదూరం పాటించాల్సిన అవసరం లేదా? మాస్కులు ఎదుటి వ్యక్తి నుంచి ధరించిన వారికి ఎంతమేరకు భద్రత ఇస్తాయి? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.

Face shields are even better than masks. Here’s how to make your own

నిపుణులు ఏమంటున్నారంటే..
* ఐదారు మంది జనం ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాత్రమే మాస్కు వాడితే ఉపయోగం లేదు.
* అందరూ వాడితేనే నూరు శాతం ఫలితాలుంటాయి. లేదంటే 50 శాతం ఫలితాలు మాత్రమే.
* ఇరువురికి మాస్కు ఉంది కదా అని ముఖంలో ముఖం పెట్టి మాట్లాడటం మంచిది కాదు.
* అంత దగ్గర నుంచి మాట్లాడితే 5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న తుంపర్లు నేరుగా నోరు లేదా ముక్కు ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది.
* ఇలాంటి అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఉన్న తుంపర్లను ఎన్-95 మాస్కులు నియంత్రించగలవని వైద్యుల అభిప్రాయం.
* మాస్కులు ఉన్నప్పటికీ ఎలాంటి ఉపరితలంపై అయినా చేయి తగలగానే శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
* పదే పదే మాస్కులు ఎక్కడంటే అక్కడ తగలడం వల్ల వాటి ఉపయోగం కన్నా ప్రమాదం ఎక్కువ.

మాస్కు ఉంది కదాని:
* మాస్కు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడకూడదు.
* అత్యంత జాగ్రత్తగా వాడాలి.
* మాస్కు ఉన్నా ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరి.
* మన వల్ల ఎదుటి వారికి ఎంత ప్రమాదమో.. వారి నుంచి మనకూ అంతే ప్రమాదం అని గుర్తించాలి.
* ఏ వస్తువును తగిలినా వెంటనే శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.

గాలి ద్వారా కరోనా వ్యాప్తి:
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గాలి ద్వారా కూడా వైరస్‌ వ్యాపిస్తోందనే వార్తలు ఇప్పుడు కొత్త ఆందోళనకు దారితీశాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో భారత్‌ మూడో స్థానానికి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌ బయోటెక్‌తో పాటు మరిన్ని సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే మనుషులపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు కూడా ఈ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇంట్లో ఉన్నా ఎన్‌95 మాస్కులు ధరించాలా?
గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. ఒకవేళ అదే నిజమైతే కచ్చితంగా మరింత ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వారు కూడా ఎన్‌-95 మాస్కులు ధరించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. చిన్న గదుల్లో ఉండేవారు, ఏసీలు వాడే వారికి ఇది ప్రమాదకరం అన్నారు. ఇంట్లో ఉన్న వాళ్లు కూడా ఒకరికి ఒకరు దూరంగా ఉండాల్సి ఉంటుంది. గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందనే వాదనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేయాలని డబ్ల్యూహెచ్ వోని నిపుణులు కోరుతున్నారు. అందుకు అనుగుణంగా తమ మార్గదర్శకాలు మార్చాలని సూచిస్తున్నారు. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే విషయం నిర్ధారణ అయ్యేవరకు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయాలన్నారు.

India Corona New Cases Deaths Update 6 July 2020.

24 గంటల్లో 24వేల 879 కేసులు:
దేశంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. వారం రోజులుగా 20వేలకు పైగా కేసులు రికార్డ్ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 24వేల 879 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. దీంతో జూలై 9 ఉదయం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7లక్షల 67వేల 296కి చేరింది. అదే సమయంలో దేశంలో మరో 487 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 21వేల 129కి చేరింది. 4లక్షల 76వేల 378 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2లక్షల 69వేల 789 యాక్టివ్ కేసులున్నాయి.