Covid-19 – Remdesivir: కొవిడ్ అనేది కామన్ అయిపోయింది.. రెమెడెసివర్ రామ బాణమేం కాదు

కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రతిఒక్కరికీ రెమెడెసివర్ ఇవ్వాలని లేదు. కేవలం టెస్టు రిజల్ట్స్ లో డాక్టర్లు ..

Covid-19 – Remdesivir:  కొవిడ్ అనేది కామన్ అయిపోయింది.. రెమెడెసివర్ రామ బాణమేం కాదు

Covid Remedisivr

Covid-19 – Remdesivir: కొవిడ్ 19 గురించి ఆందోళన చెందడం, కంగారుపడటం లాంటివి మానుకోవాలని సూచిస్తున్నారు హై లెవల్ డాక్టర్లు. ఎయిమ్స్ డైరక్టర్ డా.రణదీప్ గులేరియా, నారాయణ హెల్త్ ఛైర్మన్ డా. దేవీ శెట్టి, మేదాంత ఛైర్మన్ డా.నరేశ్ ట్రెహాన్ లు దేశంలో చెలరేగుతున్న కొవిడ్ 19 జబ్బు సమస్యలపై బుధవారం సాయంత్రం చర్చించారు.

మీ ఆక్సిజన్ లెవల్ 94శాతం కంటే ఎక్కువగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ పడిపోతూ ఉంటే అప్పుడు డాక్టర్ ను సంప్రదించాలి. సరైన టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం. మీలో ఒకవేళ లక్షణాలు కనిపించకుండా ఉండొచ్చు. అప్పుడు డాక్టర్లు చెప్పినట్లు ఇంట్లోనే ఉండి ఐసోలేషన్ లో ఉండాలి. మాస్క్ ధరించడంతో పాటు ఆక్సిజన్ శాచురేషన్ ను ఆరు గంటలకొకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి.

ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, అరుగుదల లేకపోవడం, వాంతులు వంటివి అనిపించినప్పుడు కొవిడ్ టెస్టు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు పాజిటివ్ వస్తే డాక్టర్ ను సంప్రదించి అతని సూచనలు తీసుకోండి. కంగారు పడొద్దు. కొవిడ్-19 ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రాథమిక దశలోనే తెలుసుకోగలిగితే మెడికల్ హెల్ప్ తో బయటపడొచ్చు. ఇదంతా మన బాధ్యత అని చెప్తున్నారు డా. నరేశ్ ట్రెహాన్.

రెమెడెసివర్ రామబాణమేం కాదు
మేం ఒక ప్రొటోకాల్ పాటిస్తున్నాం. కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రతిఒక్కరికీ రెమెడెసివర్ ఇవ్వాలని లేదు. కేవలం టెస్టు రిజల్ట్స్ లో డాక్టర్లు చూసి లక్షణాలు, పేషెంట్ పరిస్థితిని బట్టి మాత్రమే అవసరమవుతుందనుకుంటే ఇస్తాం. రెమెడెసివర్ అనేది రామబాణమేం కాదు. ఇది కేవలం వైరల్ లోడ్ ను మాత్రమే తగ్గిస్తుంది.

మనం సరిగ్గా వాడుకుంటే ఇవాళ మనకు సరిపడ ఆక్సిజన్ ఉంది. అంతేకానీ ఎక్స్ ట్రా తెచ్చిపెట్టుకోవాలనుకోవద్దు. అలా చేయడం వల్ల నిజంగా అవసరమైన వాళ్లకు అందకుండాపోతుంది. హోం ఐసోలేషన్ లో ఉన్న వాళ్లు కంగారుపడొద్దు. ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. రెమెడెసివర్ చాలా చిన్న అమౌంట్ ఇస్తే సరిపోతుంది. అలా అని దానిని మ్యాజిక్ బుల్లెట్ అనుకోవద్దు అని డా.గులేరియా అన్నారు.

ఆక్సిజన్ అనేది డ్రగ్ లాంటిది. ఎక్కువ మొత్తంలో తీసుకున్నా ఉపయోగం ఉండదు. చాలా మందికి ఆక్సిజన్, ఆక్సిజన్ సరఫరా అవసరముంది. దేశమంతా కలిసి పోరాడితే దాని కొరతే ఉండదని డా. గులేరియా అన్నారు.