India Covid-19 : కరోనా టెస్టులు చేయించుకోం..వ్యాక్సిన్ వేయించుకోం..ఇలాగైతే మహమ్మారిని ఖతం చేసేదెలా?

భారత్ లో కరోనా పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే..దేశంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవటానికి భయపడిపోతున్నారు. మరోపక్క వ్యాక్సిన్ వేయించుకోవటానికి సిద్ధంగా ఉన్నా కొరత. ఇంకోపక్క ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లి లాక్ డౌన్ తో సొంత రాష్ట్రాలకు వచ్చేవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోం అని తెగేసి చెబుతున్నారు. మరోపక్క టెస్టులకు ఇచ్చినవాళ్లు రాంగ్ అడ్రస్సులు. రాంగ్ ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఇలా అయితే ఇక కరోనాను ఎలా అంతం చేయగలం అనే ప్రశ్న తలెత్తుతోంది..

India Covid-19 : కరోనా టెస్టులు చేయించుకోం..వ్యాక్సిన్ వేయించుకోం..ఇలాగైతే మహమ్మారిని ఖతం చేసేదెలా?

Covid 19 In India

Covid-19 Situation in India :  భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. అలాగే మరణాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ లెక్కల గురించి పక్కన పెడితే..అసలు దేశంలో చాలామంది ప్రజలు ఎలా ఉన్నారంటే..కరోనాను ఖతం చేయటానికి ఎంతోమంది శాస్త్రవేత్తల కృష్టి ఫలితంగా వచ్చిన వ్యాక్సిన్ వేయించుకోటానికి ఆసక్తి చూపటంలేదు. గత కొంతకాలం నుంచి నగరాల్లోను..చిన్న చిన్న పట్టణాల్లోను అవగాహన పెరిగి వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు. కానీ కొన్ని గ్రామాల్లో అయితే..వ్యాక్సిన్ వేయటానికి వచ్చిన వైద్య సిబ్బంది నుంచి తప్పించుకుని పారిపోతున్నారు. యూపీలోని బరాకండీ గ్రామంలో ప్రజలు వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవటానికి నదిలోకి దూకి పోరిపోతే..మద్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా మెయిల్‌ఖేడీ గ్రామస్తులైతే ఏకంగా మాకు వ్యాక్సిన్ వద్దంటూ..వైద్య సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు.

వ్యాక్సిన్ వేయించుకోవటానికి పరిస్థితులు ఇలా ఉంటే మరోపక్క చాలామంది కరోనా టెస్ట్ లు చేయంచుకోవటానికే ఇష్టపడట్లేదు. ఉద్యోగం కోసమో లేక ఉపాధి కోసమో వేరే రాష్ట్రాలకు వెళ్లి..లాక్ డౌన్ విధించటంలో తిరిగి స్వంత రాష్ట్రాలకు..సొంత గ్రామాలకు వచ్చే వారు కరోనా టెస్టులు చేయించుకోవట్లేదు. పలు రాష్ట్రలు దాటి వెళ్లినవారు..తిరిగి పలు రాష్ట్రాల మీదుగా రైళ్లలో ప్రయాణీస్తూ..వచ్చినవారు తప్పనిసరిగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని అధికారులు చెబుతున్నా పట్టించుకోవట్లేదు. అటువంటి ఘటనే జరిగింది అసోంలోని జాగిరోడ్ రైల్వే స్టేషన్ లో.

కొవిడ్-19 ప‌రీక్ష‌ల‌ను త‌ప్పించుకునేందుకు అసోంలోని జాగిరోడ్ రైల్వే స్టేష‌న్ నుంచి దాదాపు 500 మంది ప్ర‌యాణీకులు పారిపోయారు. క‌న్యాకుమారి-దిబ్రూగ‌ఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన ప్ర‌యాణీకుల‌ను ప‌ట్టుకునేందుకు అధికారులు ప్ర‌య‌త్నించినా ప్ర‌యాణీకులు ప‌రార‌య్యారు. జాగిరోడ్ స్టేష‌న్ నుంచి త‌ప్పించుకున్న ప్ర‌యాణీకుల్లో కొద్ది మందిని అధికారులు ఎట్టకేలకు వారిని పట్టుకుని వెన‌క్కితీసుకువ‌చ్చారు.వీరిలో మ‌హిళ‌లు,చిన్నారులతో పాటు వ‌ల‌స కూలీలు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వారంతా టెస్ట్ నుంచి తప్పించుకోవటానికి పారిపోయారు.

కాగా..క‌న్యాకుమారి నుంచి ఐదు రాష్ట్రాల మీదుగా ఐదు రోజుల పాటు ప్ర‌యాణించిన రైలు అసోంకు చేరుకుంది. రాష్ట్రంలోకి వ‌చ్చే ప్ర‌యాణీకులంద‌రికీ తప్పనిసరిగా కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కానీ కన్యాకుమారి నుంచి వచ్చిన ప్రయాణీకులు జాగిరోడ్ రైల్వే స్టేసన్ కు చేరుకున్న ప్ర‌యాణీకులు స్టేష‌న్ కు చేర‌గానే టెస్టులు చేయించుకోకుండానే త‌మ గ‌మ్య‌స్థానాల‌కు ప‌రుగులు తీశారు.

దీంతో పోలీసులు విరాని పట్టుకోవటానికి రైల్వే సిబ్బందితో కలిసి ప్ర‌యాణీకుల‌ను ఆగమని చెప్పినా పట్టించుకోలేదు. ఆగండీ ఇదంతా మీ మంచి కోసమేనని వారు అరుస్తున్నా ఏమాత్రం ఖాతరు చేయలేదు. రైలు దిగిన వెంటనే భారీ సంఖ్యలో స్టేష‌న్ బయటకు ఒకరినొకరు గెంటుకుంటూ ప‌రుగ‌ులందుకున్నారు. బిహార్ లోని బ‌క్స‌ర్ లోనూ కొవిడ్ టెస్టింగ్ కు భ‌య‌ప‌డి గ‌త నెల రైల్వే స్టేష‌న్ నుంచి ప్ర‌యాణీకులు పారిపోయిన ఘ‌ట‌న వెలుగుచూసింది.

ఇదిలా ఉంటే..మరోపక్క కరోనా వ్యాక్సిన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత కొనసాగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకునే ఆసక్తి ఉన్నవారికి సరిపడాలేకపోవటంతో వ్యాక్సిన్ దొరికితే చాలు అన్నట్లుగా ఉన్నారు. ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు. కొంతమంది వ్యాక్సిన్లు వేయించుకోవాటానికి ఎదురుచూస్తుంటే..మరోపక్క వ్యాక్సిన్లు వేయించుకోమని బ్రతిమాతున్న పరిస్థితి. ఇంకోపక్క అసలు టెస్టులే చేయించుకోవటానికి ఇష్టపడని జనాలు. మరో విషయం ఏమిటంటే..దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా టెస్టుల కోసం ఇచ్చిన వేలాదిమంది తప్పుడు అడ్రస్సులు. రాంగ్ ఫోన్ నంబర్లు ఇచ్చి మిస్ అవుతున్నారు. దీంతో టెస్టులు చేసిన సిబ్బందికి సంబంధిత వ్యక్తుల టెస్టుల రిపోర్టులు వారిని ఎలా తెలియజేయాలో అర్థం కాక అయోమంలో ఉన్నారు. ఇలా దేశంలో పలు ప్రాంతాల్లో పలు రకాల ప్రజలు తీరు ఇలా ఉంది. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇక దేశంలో కరోనాను ఎలా ఖతం చేయగలం అనే ప్రశ్న పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు.