కరోనా టీకా : వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదే – మోడీ

కరోనా టీకా : వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదే – మోడీ

covid 19 vaccination drive : దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2021, జనవరి 16వ తేదీ శనివారం ఉదయం 10.30 వ్యాక్సినేషన్ వర్చువల్ విధానం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కొన్ని నెలల నుంచి కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పుడా ఆ సమయం వచ్చిందన్నారు. చాలా తక్కువ సమయంలోనే టీకా వచ్చిందని వెల్లడించారు.

శాస్త్రవేత్తల కృషి వల్ల రెండు వ్యాక్సినేషన్ లు వచ్చాయని, రాత్రింబవళ్లు వ్యాక్సిన్ కోసం పని చేశారని చెప్పారు. మరికొన్ని వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మనుషుల సంకల్పం ముందు బండలు కరుగుతాయని, రామాయణకాలంలో అప్పుడు రుజవైందని, మళ్లీ ఇప్పుడు రుజువైందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తొలి టీకాకు హక్కుదారులన్నారు. మొదటి టీకా తీసుకున్న తర్వాత..రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలనే సమాచారం వారి వారి ఫోన్ ల ద్వారా సమాచారం అందివ్వడం జరుగుతుందన్నారు. రెండు డోస్ లు తప్పనిసరిగా తీసుకోవాలని, మరిచిపోవద్దన్నారు.