Covid Vaccine Children : మార్చి16 నుండి 12-15 ఏళ్ళ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్

60 ఏళ్లు పైబడిన వారు, పిల్లలు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని సూచించారు. పిల్లలు సురక్షితంగా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు.

Covid Vaccine Children : మార్చి16 నుండి 12-15 ఏళ్ళ పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్

Vaccine Children

covid vaccine for children : మార్చి16 నుండి 12-15 ఏళ్ళు గల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టీకాలు అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మండవియా వెల్లడించారు. ఇవాళ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆయ‌న ఈ విష‌యాన్ని పేర్కొన్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఈ టీకాలు ఇవ్వ‌నున్నారు. పిల్లలు సురక్షితంగా ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. దీంతో పాటు 60 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ ముందు జాగ్రత్త డోసు ఇవ్వ‌నున్న‌ట్లు కూడా స్ప‌ష్టం చేశారు. 60 ఏళ్లు పైబడిన వారు, పిల్లలు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని సూచించారు.

ఇప్ప‌టివ‌ర‌కు 60 ఏళ్లు దాటి వ్యాధుల‌న్నవాళ్ల‌కు మాత్ర‌మే కోవిడ్ ప్రికాష‌న్ టీకాలు ఇచ్చారు. నిపుణులతో మాట్లాడిన త‌ర్వాత 12 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు టీకాలు ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి తెలిపారు. అంటే 2008, 2009, 2010 సంవ‌త్స‌రాల్లో పుటిన‌వాళ్ల‌కు ఇక నుంచి టీకాలు ఇవ్వ‌నున్నారు. 15 ఏళ్ల లోపువారికి హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ త‌యారు చేసిన కోర్బీవ్యాక్స్ టీకాను ఇవ్వ‌నున్నారు.

Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్

భారతదేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గతంలో కంటే తక్కువ సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కొత్తగా 2 వేల 503 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి 27 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నాటక రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని అక్కడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.