క్రికెటర్ షమీకి షాక్ : గృహహింస కింద చార్జిషీట్

ప్రపంచకప్‌కు ముందు టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి భారీ షాక్. షమీకి భార్య షాకులపై షాకులు. పలు కేసులు పెట్టి చుక్కలు చూపిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 04:26 AM IST
క్రికెటర్ షమీకి షాక్ : గృహహింస కింద చార్జిషీట్

ప్రపంచకప్‌కు ముందు టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి భారీ షాక్. షమీకి భార్య షాకులపై షాకులు. పలు కేసులు పెట్టి చుక్కలు చూపిస్తోంది.

కోల్‌కతా: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి భారీ షాక్. షమీకి భార్య షాకులపై షాకులు. పలు కేసులు పెట్టి చుక్కలు చూపిస్తోంది. దీంతో అతని క్రీడా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో షమీ భార్య హసీన్ జహాన్ షమీపై హత్యాయత్నం..గృహహింస‌ కేసులు పెట్టిన హసీన్ ఇప్పుడు.. వరకట్నం వేధింపుల (డౌరీ హెరాస్ మెంట్) కేసు పెట్టింది. దీంతో కోల్‌కతా పోలీసులు గురువారం (మార్చి14)న  అలీపూర్ పోలీస్ కోర్టులో నాన్‌బెయిలబుల్ నేరాల కింద షమీపై చార్జ్‌‌షీటు నమోదు చేశారు. ప్రపంచకప్‌కు రెడీ అవుతున్న షమీకి సిద్ధమవుతున్న షమీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుంది. 
Read Also: కాల్పుల కలకలం : బంగ్లా క్రికేటర్లకు తప్పిన ప్రమాదం

కోల్‌కతా పోలీసులు కోర్టుకు సమర్పించిన ఈ చార్జిషీట్‌ ప్రభావం ప్రపంచకప్‌పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2019, మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది చివర్లో జరిగిన వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ షమీని రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

ఇద్దరి మధ్య విభేదాలు – కేసులు
షమీకి వివాహేతర సంబంధం ఉందంటూ హసీన్ జహాన్ 2018 మార్చి 7న విడుదల చేసిన స్క్రీన్‌షాట్లు సంచలం అయ్యాయి. హసీన్ ఆరోపణలను ఖండించిన షమీ.. కెరీర్ ను నాశనం చేయటానికే తన భార్య కుట్ర పన్నిందని తెలిపాడు. షమీపై లైంగిక వేధింపులు, గృహహింస చట్టం కింద కేసు పెట్టిన హసీన్.. షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేేసిన విషయం కూడా తెలిసిందే. దీనిపై స్పందించిన బీసీసీఐ అతడి కాంట్రాక్ట్‌ను పెండింగ్‌ పెట్టింది. మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు అబద్ధమని తేల్చి బీసీసీఐ.. కాంట్రాక్ట్‌ను తిరిగి కొనసాగించింది. 
 
షమీతో వివాహం జరగానికి ముందు అతని భార్య హసీన్ జహాన్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు చీర్‌గాళ్‌గా పనిచేసింది. ఆ సమయంలో షమీతో పరిచయం.. పెళ్లికి దారి తీసింది. 2014లో షమీని పెళ్లాడిన అనంతరం హసీన్ మోడలింగ్‌కు గుడ్ బై చెప్పింది. 2018లో ఐపీఎల్‌కు ముందే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే షమీ నుంచి హసీనా దూరంగా ఉంటూ కేసులు పెట్టింది. ఆరోపణలు చేస్తోంది.
Read Also: సుప్రీం ఆదేశాలు : శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేత.. BCCI ఆలోచించు