ICMR on Delta Variant: ప్రమాదకరంగా మారుతున్న డెల్టా వేరియంట్.. ఐసీఎమ్మార్ స్టడీలో షాకింగ్ రిపోర్ట్

ఇండియాలో ప్రస్తుతం నమోదైన కేసుల్లో 89శాతం డెల్టా వేరియంట్ ఇన్వాల్వ్‌మెంట్ తోనే జరుగుతున్నాయి. పూణెకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెంట్ గా ఓ స్టడీ నిర్వహించింది.

ICMR on Delta Variant: ప్రమాదకరంగా మారుతున్న డెల్టా వేరియంట్.. ఐసీఎమ్మార్ స్టడీలో షాకింగ్ రిపోర్ట్

Covid Vaccintaion (1)

ICMR study: ఇండియాలో ప్రస్తుతం నమోదైన కేసుల్లో 89శాతం డెల్టా వేరియంట్ ఇన్వాల్వ్‌మెంట్ తోనే జరుగుతున్నాయి. పూణెకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెంట్ గా ఓ స్టడీ నిర్వహించింది. SARS-CoV2 వైరస్ కు సంబంధించి జెనోమ్ విశ్లేషణను ఇన్ఫెక్షన్ కు గురైన 677మందిపై జరిపింది.

ఆ స్టడీలో తేలిని విషయాల వివరాలిలా ఉన్నాయి.
* 677 కేసుల్లో 71శాతం మంది (482)లో లక్షణాలు కనిపించాయి.
* 71మంది(9.8శాతం)కి హాస్పిటలైజేషన్ అవసరమైంది.
* వారిలో ముగ్గురు మాత్రమే చనిపోయారు.

ఇన్ఫెక్షన్ కు గురైన చాలా మందిలో జ్వరం అనేది సాధారణ లక్షణంగా ఉంది. 69మంది దీనికి గురయ్యారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వికారంగా ఉండటం వంటి లక్షణాలు 56శాతం మందిలో కనిపించాయి. 45శాతం మందికి దగ్గు, గొంతులో మంట 37శాతం మందిక, వాసన-రుచి కోల్పోయిన వారు 22శాతం మంది, విరేచనాలు 6శాతం మందికి, 6శాతం మందికి శ్వాస అందకపోవడం కనిపించాయి.

* 677 మందిలో 604మంది (89శాతం) కొవీషీల్డ్ తీసుకున్న వారు, కొవాగ్జిన్ తీసుకున్న వారు (10.5శాతం). ఇద్దరు మాత్రం సినోఫార్మ్ తీసుకున్నారు.
* దేశంలో నలుమూలల నుంచి డెల్టా, కప్పా వేరియంట్ల కారణంగా ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.
* కొన్ని చోట్ల మాత్రం డెల్టా, కప్పా వేరియంట్లతో పాటు ఆల్ఫా కూడా కనిపించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

వ్యాక్సినేషన్ చేయించుకోవడంతో ఇన్ఫెక్షన్ సోకినప్పటికీ ప్రాణాలతో బయటపడగలిగారని ఐసీఎమ్మార్ రీసెంట్ స్టడీలో వెల్లడించింది.