Bride Dedication: అంగరంగ వైభవంగా ముగిసిన పెళ్లి.. ఓటేశాకే అత్తారింటికి..

ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికలు మూడో దశలో భాగంగా ఆదివారం 59నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. విభిన్న పార్టీల నుంచి పోరాడిన వందల కొద్దీ లీడర్ల భవితవ్యం పోలింగ్ బూత్ లలో...

Bride Dedication: అంగరంగ వైభవంగా ముగిసిన పెళ్లి.. ఓటేశాకే అత్తారింటికి..

New Project

Bride Dedication: ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికలు మూడో దశలో భాగంగా ఆదివారం 59నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. విభిన్న పార్టీల నుంచి పోరాడిన వందల కొద్దీ లీడర్ల భవితవ్యం పోలింగ్ బూత్ లలో నిక్షిప్తమైంది. ఇక పోలింగ్ లో సక్సెస్‌ఫుల్‌గా పాల్గొనాలని ఓటు హక్కును వినియోగించుకోవాలనే సందర్భాన్ని పట్టించుకోకుండా ఓటేసేందుకు వచ్చారు.

ఎన్నికల కోసం పెళ్లిని, పెళ్లి ఏర్పాట్లను వాయిదా వేసి ఓటేశారు. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ నవ వధూవరులైన జంట పోలింగ్ బూత్ దగ్గర తళుక్కుమన్నారు. పెళ్లికూతురు సంప్రదాయ దుస్తులైన ఎర్ర రంగు, బంగారు వర్ణమైన లెహంగాలో బంగారు ఆభరణాలు ధరించి ఓటేయడానికి వచ్చింది.

పెళ్లి జరిగిన కొద్ది గంటలకే పోలింగ్ బూత్ కు పెళ్లికూతురు బట్టల్లో వచ్చి ఓటేసి ఆ తర్వాతే అత్తారింటికి వెళ్లింది. ఓటేసేందుకు వచ్చిన మహిళను చూసి ఓటర్లంతా అవాక్కయ్యారు.

Read Also : వివాదంలో కాన్పూర్ మేయర్.. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ ఫొటోలు..!

దీనిపై ANI న్యూస్ ఏజెన్సీ.. ‘కొత్తగా పెళ్లి చేసుకున్న వధువు జూలీ ఫిరోజాబాద్ జిల్లాలో అవే దుస్తుల్లో వచ్చి ఓటేసింది. ఆ తర్వాతే అత్తారింటికి వెళ్లారు’ అని పోస్టు పెట్టింది.