మర్డర్ కేసులో నిందితుడి పెళ్లి కోసం హైకోర్ట్ బెయిల్

10TV Telugu News

మర్డర్ కేసులో నిందితుడైన వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన వ్యక్తి పెళ్లి చేసుకుని, తన భార్య పేరు మీద ల్యాండ్ రిజిష్టర్ చేయడానికి బెయిల్ అప్పీల్ చేశారు. రాజేశ్ భవానియా గ్యాంగ్ లో సభ్యుడైన వ్యక్తికి ఢిల్లీ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది.

నవంబర్ 23న రిలీజ్ అయ్యేందుకు బెయిల్ ఇస్తూ తిరిగి నవంబర్ 27కంటే ముందే సరెండర్ అవ్వాలని చెప్పింది. నిందితుడైన శేఖర్.. నవంబర్ 25న వితంతువైన మరదలిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.హర్యానా, ఢిల్లీలలో పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాడు. దాంతో పాటుగా రూ.25వేల పూచికత్తు చెల్లించాలని ఆంక్షలు విధించారు.

నిందితుడ్ని నేరుగా అతని గ్రామానికి తీసుకెళ్లి విడిచిపెడతారు. అక్కడి నుంచి ఎటూ వెళ్లడానికి వీల్లేదు. కేవలం తన భార్య పేరు మీద పొలం రిజిష్టర్ చేయడానికి మాత్రమే వీలుందని జస్టిస్ విభూ భఖ్రూ అంటున్నారు.

మరే ఇతర ప్లేస్‌కు వెళ్లకుండానే అతణ్ని జైలు అధికారులకు అప్పగించాలి. సాక్ష్యులతో గానీ, బాధితుల కుటుంబ సభ్యులతో గానీ, నేరుగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ కలిసేందుకు వీల్లేదు. అడ్వకేట్ అమిత్ సానీ.. శేఖర్‌కు బెయిల్ ప్లీ పెట్టారు.

నిందితుడి కుటుంబ కమ్యూనిటీ సంప్రదాయ ప్రకారం.. కుటుంబంలో ఒక వ్యక్తి పిల్లలతో ఉండగా వ్యక్తి చనిపోతే అదే కుటుంబానికి చెందిన అతని సోదరుడే వితంతువును వివాహం చేసుకోవాలి’ అని లాయర్ తెలియజేశారు.

10TV Telugu News