Delhi New Plan: థర్డ్ వేవ్ కోసం 5వేల మంది హెల్త్ అసిస్టెంట్లు

కొవిడ్ థర్డ్ వేవ్ కోసం ప్రిపరేషన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 5వేల మంది యువకులను మెడికల్ అసిస్టెంట్లుగా ట్రైనింగ్ ఇవ్వనుంది. డాక్టర్లు, నర్సులకు సహాయకులుగా ఉంటూ.. గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో ...

Delhi New Plan: థర్డ్ వేవ్ కోసం 5వేల మంది హెల్త్ అసిస్టెంట్లు

Aravind Kejriwal

Delhi New Plan: కొవిడ్ థర్డ్ వేవ్ కోసం ప్రిపరేషన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 5వేల మంది యువకులను మెడికల్ అసిస్టెంట్లుగా ట్రైనింగ్ ఇవ్వనుంది. డాక్టర్లు, నర్సులకు సహాయకులుగా ఉంటూ.. గురు గోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో రెండు వారాల పాటు ట్రైనింగ్ ఇస్తారు. 9 ప్రధాన వర్సిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.

సీఎం కేజ్రవాల్ స్వయంగా ఈ ప్రకటన చేశారు. మెడికల్, పారా మెడికల్ స్టాఫ్ కొరత కారణంగా ఫస్ట్, సెకండ్ వేవ్ లో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని.. మరోసారి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లు సీఎం అన్నారు.

‘ఫస్ట్, సెకండ్ వేవ్ ల ప్రభావం ఉన్న సమయంలో మెడికల్, పారా మెడికల్ స్టాఫ్ కొరత ఏర్పడింది. మరోసారి అలాంటి పొరబాటు జరగకుండా ఉండాలని.. ప్రభుత్వం 5వేల మంది హెల్త్ అసిస్టెంట్లను, 5వేల మంది యువతను ట్రైనింగ్ కు ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనుంది. ఒకొక్కరు రెండు వారాల పాటు ట్రైనింగ్ తీసుకుంటారు. ఢిల్లీలోని 9ప్రధాన మెడికల్ ఇన్‌స్టిట్యూట్లలో శిక్షణ ఇస్తారు’ అని సీఎం అన్నారు.

నర్సింగ్, పారామెడిక్స్, లైఫ్ సేవింగ్, ఫస్ట్ ఎయిడ్, హోం కేర్ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు.

ఢిల్లీ హెల్త్ అసిస్టెంట్లకు అర్హత;
పన్నెండో తరగతి కచ్చితంగా పాస్ అవ్వాలి.
18ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి.