CM Arvind Kejriwal: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై కేజ్రీవాల్ ఫైర్.. బురద రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శ
ఢిల్లీకి సంబంధించిన అనేక అంశాల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతోంది. ఢిల్లీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపించే అంశంపై ఎల్జీ వీకే సక్సేనా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం తాజా వివాదానికి కారణమవుతోంది.

CM Arvind Kejriwal: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య చాలాకాలంగా ‘పొలిటికల్ వార్’ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి సంబంధించిన అనేక అంశాల్లో ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతోంది.
NSA Ajit Doval: అమెరికా సెక్రటరీతో అజిత్ ధోవల్ భేటీ.. రక్షణ రంగ సహకారంపై చర్చ
తాజాగా ఇరువురి మధ్య మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఢిల్లీకి చెందిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపించే అంశంపై ఎల్జీ వీకే సక్సేనా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం తాజా వివాదానికి కారణమవుతోంది. ఈ అంశంలో కేజ్రీవాల్.. వీకే సక్సేనాపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎల్జీపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ టీచర్ల ఫిన్లాండ్ యాత్రకు ఇంకా అనుమతివ్వకపోవడం ద్వారా ఎల్జీ బురద రాజకీయాలు చేస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానాల్లో ఫిన్లాండ్ ఒకటి.
అందుకే అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు, శిక్షణ పొందేందుకు ఢిల్లీకి చెందిన కొందరు ప్రభుత్వ టీచర్లను ఫిన్లాండ్ పంపించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ టీచర్లు విదేశాల్లో పర్యటించాలంటే ఎల్జీ అనుమతి కావాలి. ఈ అనుమతి కోరుతూ రూపొందించిన ఫైల్‌ను ఢిల్లీ ప్రభుత్వం చాలా రోజుల క్రితమే ఎల్జీకి పంపింది. అయితే, ఇప్పటివరకు ఈ ఫైల్‌కు ఎల్జీ ఆమోదం తెలపలేదు. ఈ విషయంలో ఆయన కావాలనే నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా దీనిపై కేజ్రీవాల్ మాట్లాడారు.
‘‘ఢిల్లీ టీచర్ల ఫిన్లాండ్ యాత్రకు సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వం అనేకసార్లు ఎల్జీకి పంపింది. ఈ ఫైల్ పంపి 15 రోజులవుతున్నా దీనికి ఆయన ఆమోదం తెలపలేదు. వచ్చే మార్చిలోనే టీచర్లు ఫిన్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. దీనికి అనుమతివ్వకపోడం ద్వారా ఎల్జీ బురద రాజకీయాలు చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ విమర్శించారు.