Dmart Owner: వెయ్యి కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన డీమార్ట్ ఓనర్

తాజాగా ప్రముఖ డీమార్ట్ సంస్థ యజమాని రాధాకృష్ణన్ దమాని ముంబైలో ఇల్లు కొనుగోలు చేశారు. అత్యంత కోటీశ్వరులు, పెద్ద పెద్ద సెలబ్రేటీలు..

Dmart Owner: వెయ్యి కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన డీమార్ట్ ఓనర్

Dmart Owner

Dmart Owner: తాజాగా ప్రముఖ డీమార్ట్ సంస్థ యజమాని రాధాకృష్ణన్ దమాని ముంబైలో ఇల్లు కొనుగోలు చేశారు. అత్యంత కోటీశ్వరులు, పెద్ద పెద్ద సెలబ్రేటీలు ఉండే మల్బార్ హిల్స్ లో కావడం విశేషం. ఆ ఇల్లు ధర రూ. వెయ్యి కోట్లు.

ఈ విషయం వైరల్ అయింది. ఇంటి పరిమాణం విషయానికి వస్తే.. విస్తీర్ణం 5752.22 చదరపు అడుగులు. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 724 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఇంటి యొక్క స్టాంప్ డ్యూటీ కోసం దమాని రూ.30 కోట్లు చెల్లించారట.

గత మార్చి 31 న ఆయన ఈ ఇంటిని కొనుగోలు చేశారు. పూమాచంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్, పరేష్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్, ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ అండ్ సన్స్ నుంచి దమాని, ఆయన సోదరుడు గోపికిషన్ కొన్నారు. ఈ ఇంటిని రాధాకృష్ణ దమాని అతని సోదరుడు గోపీకిషన్ కలిసి కొన్నారు.

2020లో విడుదలైన ఫోర్బ్స్ ఇండియా రిచెస్ట్ జాబితా ప్రకారం రాధాకృష్ణన్ దమాని దేశంలోని నాలుగో అతి పెద్ద ధనవంతుడు. దమాని మొత్తం ఆస్తుల విలువ 15.4 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని సమాచారం.

రాధాకృష్ణన్ దమాని జీవితం ప్రారంభం గురించి తెలిస్తే షాక్ అవడం గ్యారెంటీ. ఆయన ముంబై టెనెంట్ బ్లాక్ లో ఒక్క రూమ్ అపార్ట్మెంట్ నుంచి జీవితాన్ని ప్రారంభించి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయనకు ఉన్న వ్యాపారాల్లో అత్యంత ఫేమస్ డీ-మార్ట్.