First One Rupee Coin: మన తొలి రూపాయి ఎలా పుట్టిందో తెలుసా?

మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా.. అది మొదలయ్యేది ఒక్క రూపాయితోనే. ఎన్ని వేలకోట్లయినా ఈ రూపాయితో లెక్క మొదలు కావాలి.

First One Rupee Coin: మన తొలి రూపాయి ఎలా పుట్టిందో తెలుసా?

First One Rupee Coin

First One Rupee Coin: మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా.. అది మొదలయ్యేది ఒక్క రూపాయితోనే. ఎన్ని వేలకోట్లయినా ఈ రూపాయితో లెక్క మొదలు కావాలి. మన దేశ చరిత్రలో చూస్తే ముందు వస్తు మార్పిడితో ప్రజల జీవనం సాగేది. ఆ తర్వాత బ్రిటిషర్లు మన దేశంలో అడుగుపెట్టాక మెల్లగా కరెన్సీ ప్రభావం మొదలైంది. అప్పట్లో రూపాయికన్నా తక్కువ నాణేలు బాగా చెలామణిలో ఉండేదన్న సంగతి మనకి తెలిసిందే కాగా.. అయితే.. ముందుగా తయారైంది మాత్రం రూపాయి నాణెమే. అలాంటి రూపాయి నాణెం తొలిసారి ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాపారం నిమిత్తం మన దేశానికి వచ్చిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1757లో ప్లాసీ యుద్ధంలో విజయం తర్వాత ఇండియా పాలనా పగ్గాలు అందుకోగా.. ప్లాసీ యుద్దం తర్వాత బెంగాల్‌ నవాబుతో ఒప్పందం కుదుర్చుకుని నాణేలను తయారుచేయడం ప్రారంభించింది. తొలి రూపాయి నాణెం 264 సంవత్సరాల క్రితం 1757లో సరిగ్గా ఇదే రోజున అందుబాటులోకి తీసుకురాగా.. ఆ తర్వాత మన దేశంలో నాణేల తయారీ కోసం సూరత్‌, బొంబాయి, అహ్మదాబాద్‌లో మింట్‌ను నెలకొల్పింది.

తొలి రూపాయి నాణెం మాత్రం కోల్‌కతాలోని మింట్‌లోనే తయారవగా దేశంలో అన్ని మింట్లలో ఒకే నాణేలు తయారవ్వాలని 1835లో ఉత్తర్వులు జారీ చేయడంతో ఒకే రకం నాణేలు అందుబాటులోకి వచ్చాయి. 1857 తర్వాత ఇండియా పాలన నేరుగా బ్రిటీష్ రాజుల చేతుల్లోకి వెళ్లడంతో నాణేలపై బ్రిటీష్ చక్రవర్తి బొమ్మను ముద్రించడం మొదలు పెట్టారు. అలా మన దేశంలో చెలామణికి వచ్చిన రూపాయి నాణేలు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మూడేళ్ళ వరకు కూడా అందుబాటులోనే ఉన్నాయి.