Divorce: ప్రపంచంలో విడాకుల శాతం ఎక్కువ ఉన్న దేశాలు ఏవో తెలుసా..? భారత్ పరిస్థితి ఏమిటి?

సుప్రీంకోర్టు తాజా తీర్పు సంగతి అలా ఉంచితే.. ప్రపంచంలో విడాకులు తీసుకుంటున్న జంటల విషయంలో భారత్‌దేశం ఏ స్థానంలో ఉందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Divorce: ప్రపంచంలో విడాకుల శాతం ఎక్కువ ఉన్న దేశాలు ఏవో తెలుసా..? భారత్ పరిస్థితి ఏమిటి?

divorce

Divorce: భార్యాభర్తల మధ్య విడాకుల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించిన విషయం విధితమే. పరస్పర సమ్మతితో విడాకులు కోరుకునే దంపతులు హిందూ వివాహ చట్టం -1955 ప్రకారం ఆరు నెలలు దాకా వేచి చూడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. చక్కదిద్దలేనంతగా దంపతుల మధ్య విబేధాలు నెలకొని, వారిద్దరూ ఇష్టపూర్వకంగా విడిపోవాలని భావిస్తే ఆ వివాహాలను రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని 142(1) అధికరణం కింద తమకు విశేషాధికారం ఉందని కోర్టు స్పష్టం చేసింది.

Supreme Court : విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం

కుటుంబ న్యాయస్థానాలకు పంపించకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరుచేసే అంశంపై పలు పిటీషన్లు దాఖలయ్యాయి.  2016లో ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. 2022 సెప్టెంబర్ నెలలో తీర్పును రిజర్వు చేసింది. సోమవారం సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ కౌల్‌తో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జే.కె. మహేశ్వరి ఉన్నారు.

Quad Summit 2023: చైనాకు షాకిచ్చిన అమెరికా.. క్వాడ్‌లో కొత్త దేశాలకు ప్రవేశం లేదు..

సుప్రీంకోర్టు తాజా తీర్పు సంగతి అలా ఉంచితే.. ప్రపంచంలో విడాకులు తీసుకుంటున్న జంటల విషయంలో భారత్‌దేశం ఏ స్థానంలో ఉందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో ప్రపంచంలోకెల్లా అతి తక్కువ విడాకుల కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రతీ వెయ్యి వివాహాల్లో 13వివాహాలు పెటాకులవుతున్నాయని ఓ సర్వే తేల్చింది. అంటే భారతదేశంలో విడాకులు తీసుకుంటున్నవారు ఒక శాతం మాత్రమేనట. అయితే, ఎక్కువ శాతం జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో లక్సేంబర్గ్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో 87శాతం మంది వివాహం తరువాత విడాకులు తీసుకుంటున్నారు. ఆ తరువాతి స్థానంలో స్పెయిన్ 67శాతం, ఫ్రాన్స్ 55శాతం, రష్యా 51 శాతం, అమెరికా 46 శాతం జంటలు విడాకులు తీసుకుంటున్నాయి.

IPL 2023: మళ్లీ రచ్చరచ్చ చేశారు.. గంభీర్, కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం.. అడ్డుకున్న ఇరు జట్ల సభ్యులు .. వీడియోలు వైరల్

తక్కువ జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో కేవలం ఒక శాతం మంది కపుల్స్ మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు. చిలీ దేశంలో మూడు శాతం, కొలంబియాలో 9శాతం, మెక్సికో, కెనన్యా దేశాల్లో 15 శాతం మంది జంటలు విడాకులు తీసుకుంటున్నారు.