Sensex‌ : తొలిసారిగా 60 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

ద‌లాల్ స్ట్రీట్‌లో ముందే దీపావ‌ళి వ‌చ్చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌లో ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పాయి. సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారి 60 వేల మార్క్‌ను దాటింది.

Sensex‌ : తొలిసారిగా 60 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

Sensex

Domestic stock markets : ద‌లాల్ స్ట్రీట్‌లో ముందే దీపావ‌ళి వ‌చ్చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌లో ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పాయి. సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారి 60 వేల మార్క్‌ను దాటింది. ఈ రోజు సెన్సెక్స్‌ ఏకంగా 60 వేల 158 పాయింట్లతో ఓపెన్ నమోదైంది. బీఎస్ఈ నిన్న ఇండెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఓ దశలో 59వేల 957 పాయింట్లను తాకింది.

నిన్న సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కూడా జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బుల్‌ ఊపు చూస్తే నిన్ననే 60వేలు దాటుతుందని భావించారు. నిన్న సెన్సెక్స్ దూకుడుతో బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల విలువ 3లక్షల కోట్లు పెరిగింది.

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్ తో డయాలసిస్ రోగుల్లో ఇన్‌ఫెక్షన్ ముప్పు తగ్గుదల

ఈ ఒక్క ఏడాదిలోనే సెన్సెక్స్‌ 10 వేల పాయింట్లు పెరిగింది. భారత మార్కెట్‌పై విదేశీ మదుపర్ల ఆసక్తి చూపడం.. విదేశీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో బుల్ నాన్‌స్టాప్‌గా పరుగులు పెడుతోంది. ఫెడ్‌ వడ్డీరెట్లు పెంచదన్న అంచనాలతో మార్కెట్లలో జోష్ కొనసాగుతోంది.