Updated On - 12:36 pm, Thu, 23 July 20
By
madhuCORONA VIRUS పై WH0 మరో బాంబు పేల్చింది. వచ్చే 2021 ప్రారంభం వరకు వ్యాక్సిన్ ఆశించొద్దంటూ కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు WHO అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖెల్ జె.ర్యాన్ సోషల్ మీడియా ద్వారా మాట్లాడారు.
వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు who పని చేస్తుందని చెప్పారు. అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే విధంగా….ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయనే విషయాన్ని గుర్తు చేశారాయన.
ప్రస్తుత సమయం..వైరస్ ను అరికట్టేందుకు ప్రయత్నించాలని దేశాలకు సూచించారు. ఇదే ప్రధాన లక్ష్యం కావాలని, ఇక వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయన్నారు.
ట్రయల్స్ మంచి పురోగతిలో ఉన్నాయని, ఇప్పుడు 3వ దశ ట్రయల్స్ లో నడుస్తున్నాయన్నారు. ఇందులో ఏ ఒక్క టీకా విఫలం కాలేదని, రోగ నిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేసే సామర్థ్యం పరంగా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు మైఖెల్. వైరస్ అదుపులోకి వచ్చేంత వరకు పాఠశాలలు తిరిగి రీ ఓపెన్ చేసే అంశంపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు.
మోడీకి మన్మోహన్ లేఖ..కరోనా కట్టడికి 5 సూచనలు
Niti Aayog : కరోనా సెకండ్ వేవ్ తో దారుణంగా పరిస్థితులు..తర్వలో మరో ఉద్దీపన ప్యాకేజీ
DSP passes away : కరోనా వైరస్ సోకి డీఎస్పీ కన్నుమూత
Etah Temple : దుర్గాదేవికి మాస్క్, ప్రసాదంగా మాస్క్ లు
Motukupalli Narasimhulu : బీజేపీ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్ధితి విషమం
Double Mask: డబుల్ మాస్క్ ఎంతో బెటర్.. కరోనాను కంట్రోల్ చేస్తుందా?