హానీ ట్రాప్ లో చిక్కిన DRDO సైంటిస్ట్….రూ.10 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

  • Edited By: murthy , September 29, 2020 / 04:42 PM IST
హానీ ట్రాప్ లో చిక్కిన DRDO సైంటిస్ట్….రూ.10 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

DRDO scientist: మగవకు దాసోహం కాని వాళ్లు ఎవరూ ఉండరు. ఎంత గొప్ప వారైనా పరాయి స్త్రీ పొందు కోసమో, స్నేహం కోసమో పరితపిస్తూ ఉంటారు. ఆడదాని ఓరకంటి చూపులు సులభంగా లోంగిపోతారు మగవారు. అలాంటి వారిని తమ వలలో వేసుకుని సులభంగా డబ్బు సంపాదించే ఆడవాళ్లు సొసైటీలో నేడు ఎక్కువయ్యారు.

ఆడవారితో మసాజ్ చేయించుకోవాలని ఉబలాట పడి, హానీ ట్రాప్ లో చిక్కుకున్న జూనియర్ స్ధాయి సైంటిస్టును ఢిల్లీ పోలీసులు రక్షించారు. ఢిల్లీ లో కేంద్ర రక్షణ రంగ సంస్ధల్లో పని చేస్తున్న జూనియర్ సైంటిస్టు (35)ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు చెల్లించలేని శాస్త్రవేత్త కుటుంబం పోలీసులను సంప్రదించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సైంటిస్టును క్షేమంగా రక్షించారు.నోయిడా సెక్టార్ 77 లో నివసించే సైంటిస్ట్(35) సెప్టెంబర్ 27 శనివారం సాయంత్రం గం. 5-30 సమయంలో కొన్ని వస్తువులు కొనుక్కురావటానికి నోయిడాలోని సిటీ సెంటర్ కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. అలా వెళ్లిన వ్యక్తి…. అర్ధరాత్రి అయినా అతను ఇంటికి తిరిగిరాలేదు.

ఆ సమయంలో ఆయన భార్యకు ఒక అపరిచితమైన నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ భర్తను కిడ్నాప్ చేశాము. మీ భర్తను క్షేమంగా విడిచిపెట్టాలంటే రూ.10 లక్షలు చెల్లించాలని ఫోన్ లో అవతలి నుంచి ఒక మహిళ డిమాండ్ చేసింది. భార్య డబ్బు ఏర్పాటు చేయటానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు సాధ్య పడలేదు.ఆదివారం ఆమె సెక్టార్ 49 పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. సైంటిస్ట్ ను హర్యానాలోని భివానీలోని సెక్టార్ 41 లోని ఓయో హోటల్ లో బంధించి నట్లుగా గుర్తించారు. హోటల్ పై దాడి చేసి సైంటిస్టును క్షేమంగా రక్షించి…. కిడ్పాప్ చేసిన వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరూ పరారీలో ఉన్నారు.

నోయిడా అడిషనల్ డిప్యూటీ పోలీసు కమీషనర్ రణవిజయ్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం….సైంటిస్ట్ గా పని చేస్తున్న వ్యక్తి మహిళలతో మసాజ్ చేయించుకోటానికి స్పా సెంటర్ల గురించి ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేసి ఒక అడ్రస్ తెలుసుకున్నాడు.కొన్నిసెంటర్లకు ఫోన్ చేయగా అతనికి అనిల్ కుమార్ శర్మ అనే వ్యక్తి లైన్ లోకి వచ్చి సైంటిస్ట్ కోరిన సేవలు అందిస్తామని చెప్పాడు. శనివారం సాయంత్రం నోయిడాలోని సిటీ సెంటర్ వద్దకు రావాల్సిందిగా సూచించాడు. అతను చెప్పినట్లుగానే సైంటిస్ట్ సాయంత్రం తన హోండా సిటీ కారులో సిటీ సెంటర్ కు చేరుకున్నాడు.

కారు అక్కడ వదిలి తాను చెప్పిన వ్యక్తితో వెళ్తే మీరు కోరిన సేవలు లభిస్తాయని అనిల్ కుమార్ శర్మ చెప్పటంతో, సైంటిస్ట్ కారు అక్కడే వదిలి అనిల్ చెప్పిన వ్యక్తితో వేరే కారులో వెళ్లాడు. అక్కడి నుంచి వారు భివానీలోని ఓయో హోటల్ కు వెళ్లారు.అక్కడ దీపక్ కుమార్, సునీతా గుర్జార్, అలియాస్ బబ్లీ, రాకేష్ కుమార్, మన్వీర్ గుర్జార్ ,మరో ఇద్దరు వ్యక్తులు సైంటిస్ట్ పై దాడి చేసి బంధించారు. అతని భార్యకు పోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. అతని భార్య డబ్బుకోసం ప్రయత్నించినప్పటికీ లభ్యం కాకపోవటంతో పోలీసులను ఆశ్రయించింది.

ఆదివారం ఉదయం ఆపరేషన్ మొదలెట్టిన పోలీసులు సైంటిస్టును క్షేమంగా విడిపించ గలిగారు. పట్టుబడిన వారిలో ఒక మహిళ నోయిడాకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి అనుచరురాలుగాను, బిగ్ బాస్ 10 విజేత కు బంధువుగాను గుర్తించారు.రాకేష్ కుమార్ ఓయో హోటల్ నిర్వాహకుడిగా పోలీసులు తెలిపారు. సైంటిస్టును రక్షించినందుకు గౌతమ బుధ్ధ నగర పోలీసు కమీషనరేట్కు కేంద్ర హోంశాఖ 5 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.ఇటీవల నోయిడా ఫ్రాంతంలో హానీ ట్రాప్ ముఠాలు చాలా యాక్టివ్ గా పని చేస్తున్నాయని….. మహిళలను ఎరవేసి, మగవారిని ఉచ్చులోకి లాగి డబ్బు డిమాండ్ చేస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. ఇటీవల పోలీసులు ఢిల్లీకి చెందిన సోనూ, పంజాబన్ ముఠాలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.అరెస్టు చేసిన వారి వద్దనుంచి సెల్ ఫోన్లు, కొన్ని పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులుతెలిపారు. ఈ ముఠా గత 4,5 నెలలుగాయాక్టివ్ గా ఉండి మగవారిని హానీ ట్రాప్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు దోచేస్తోందని పోలీసులు వెల్లడించారు. ముఠాకు చెందిన పరారీలో ఉన్న ఇద్దరు సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.