అరాచకం: కుక్కపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్ 

  • Published By: vamsi ,Published On : February 27, 2019 / 08:48 AM IST
అరాచకం: కుక్కపై అత్యాచారం.. యువకుడు అరెస్ట్ 

ఎవరైనా తప్పు చేస్తే వారిని కుక్కతో పోలుస్తాం.. అత్యచారం ఘటనకు పాల్పడితే చిత్తకార్తె కుక్క పని చేశారంటూ తిడతాం. అదే కుక్కపైనే అత్యచారం చేస్తే అటువంటి వ్యక్తిని ఏమనాలి. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ యువకుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసిప కటకటాల్లో పెట్టారు పోలీసులు. చెన్నైలోని నందనం ప్రాంతంలోని ఓ టీస్టాల్‌లో పనిచేస్తున్న నిందితుడు ఫూటుగా మద్యం సేవించి వీధిలోని కుక్కపై అత్యాచారం చేశాడు. ఈ ఘటను గమనించిన స్థానికులు అతడిని తిట్టి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు.
Also Read: లిక్కర్ కు ఆధార్ లింక్ చేద్దామా! : కార్డు చూపించి బాటిల్ తీసుకోండి

అయితే నిందితుడు మాత్రం వారిని లెక్క చేయలేదు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు వచ్చిన  పోలీసులు.. అతనిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అత్యాచారానికి గురైన కుక్కతో తిరుగుతున్న నిందితుడి వీడియోను స్థానికులు పోలీసులు ఆధారాలుగా సమర్పించారు. అయితే, నిందితుడు కుక్కపై అత్యాచారం చేస్తున్నట్లు ఆధారాలు మాత్రం లేవు.

దీంతో పోలీసులు కుక్కను వైద్య పరీక్షలకు తరలించి, నిందితుడిని విచారిస్తున్నారు. నిందితుడు నిత్యం వీధి కుక్కలతో కలిసి ఉండటాడని, ముఖ్యంగా అర్ధరాత్రిళ్లు వాటితో గడుపుతుంటాడని స్థానికులు ఇచ్చిన స్టేట్ మెంట్ మేరకు పోలీసులు నిందితుడిపై సెక్షన్ 377, 429 కింద కేసులు నమోదు చేశారు.