గమ్మునుండవమ్మా : సాధ్విపై ఈసీ 72గంటల బ్యాన్

  • Published By: venkaiahnaidu ,Published On : May 1, 2019 / 04:00 PM IST
గమ్మునుండవమ్మా : సాధ్విపై ఈసీ 72గంటల బ్యాన్

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ను 72గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎలక్షన్ కమిషన్ బ్యాన్ విధించింది.బాబ్రీ మసీదు కూల్చివేత,హేమంత్ కర్కర్ మరణంపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను ఈసీ ఆమె ప్రచారంలో పాల్గొనకుండా బ్యాన్ విధించింది.

సాధ్వి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పినప్పటికీ ఈసీ సంతృప్తి వ్యక్తం చేయలేదు.బాబ్రీ మసీదు కూల్చివేతపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిన కిందకే వస్తుందని ఈసీ తన ఆర్డర్ లో తెలిపింది.మే-2,2019 ఉదయం 6గంటల నుంచి బ్యాన్ అమలులోకి వస్తుందని ఈసీ తెలిపింది.మే-2 ఉదయం 6గంటల నుంచి సాధ్వి ఎటువంటి బహిరంగ సభల్లో,ర్యాలీల్లో,రోడ్ షోలో,ఇంటర్వ్యూ,ప్రింట్,ఎలక్ట్రానిక్,సోషల్ మీడియాల ద్వారా పబ్లిక్ తో కమ్యూనికేషన్ పెట్టుకోకూడదు.

బాబ్రీ మసీదు కూల్చివేసే సమయంలో తాను కూడా అక్కడున్నానని,మసీదు కూల్చివేసినందుకు తాను గర్వపడుతున్నానని ఇటీవల సాధ్వి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే తన శాపం వల్లే చనిపోయాడంటూ సాధ్వి ఇటీవల కామెంట్స్ చేశారు.