వీడియోకాన్ కేసు :చందాకొచ్చర్ నివాసంలో ఈడీ సోదాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2019 / 07:27 AM IST
వీడియోకాన్ కేసు :చందాకొచ్చర్ నివాసంలో ఈడీ సోదాలు

వీడియోకాన్ అక్రమ రుణాల కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ ఇంట్లో శుక్రవారం (మార్చి-1,2019) ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ కు చెందిన న్యూపర్ రిన్యూవబుల్స్ ఆఫీస్ లో ముంబై, ఔరంగాబాద్ లోని  వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ ఆఫీసుల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ తెలిపింది. 
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

చందాకొచ్చర్  దేశం వదిలి పారిపోకుండా  ఇటీవల సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ లపై గతంలో జారీ అయిన లుక్ అవుట్ నోటీసులను తిరిగి పునరుద్ధరించింది. చందాకొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా ఉన్న సమయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆమె తన సీఈవో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Read Also : ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట : పాక్ డిమాండ్