‘చుక్క’ల్లో ప్రచారం  : ఎన్నికల వేళ హెలికాప్టర్ డిమాండ్ 

  • Published By: veegamteam ,Published On : April 7, 2019 / 08:51 AM IST
‘చుక్క’ల్లో ప్రచారం  : ఎన్నికల వేళ హెలికాప్టర్ డిమాండ్ 

ఎన్నికల వేళ కాలినడకన ప్రచారాలకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా హై ఫై. ఖర్చు ఎక్కువైనా సరే..ప్రచారంలో  హై ఫై ఉండాల్సిందే. దీంతో హెలీ క్యాఫ్టర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒకప్రాంతం నుండి మరో ప్రాంతానికి అతి తక్కువ సమయంలో వెళ్లాలంటే హెలికాప్టర్. ఇప్పుడంతా  ప్రచారంలో హెలీక్యాప్టర్‌ ఓ భాగంగా మారిపోయింది.  దీనికి జాతీయ నేతలే కాకుండా రాష్ట్రానికి చెందిన నాయకులు సైతం హెలీక్యాప్టర్‌లలో చక్కర్లు కొడుతున్నారు. 

పొరుగు రాష్ట్రాలతో పోల్చితే బెంగళూరులోనే ఎక్కువగా  ఏవియేషన్‌ సంస్థలు ఉన్నాయి. దీంతో మే నెల 10వరకు హెలీక్యాప్టర్‌లు బుక్ అయిపోయాయి. దీన్నిబట్టి డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో  ఏవియేషన్‌ సంస్థలు గంటకు 60 నుంచి 80వేల రూపాయల చొప్పున అద్దెతో హెలీక్యాప్టర్‌లను ఇస్తాయి. తాజా ఎన్నికల దృష్ట్యా ఈ రెంట్ ను  రెట్టింపు చేశాయి. అంటే గంటకు రూ.1.20 లక్షలు అద్దె ఉండగా జీఎస్టీతో కలిపితే 1.50 లక్షలదాకా వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ల్యాండింగ్‌ వ్యవస్థ, హెలీక్యాప్టర్‌లు ఆపిన చోట రక్షణ చర్యలకు ఎక్ట్ర్సా  వసూలు చేస్తున్నారు.

 
కేరళకు చెందిన కేప్టెన్‌ కంపెనీ ప్రతినిధులు ఏప్రిల్‌ చివరిదాకా అదనపు హెలీక్యాప్టర్‌లు సమకూర్చలేమని ప్రకటించాయి. దీంతో బెంగళూరు హెలీక్యాప్టర్‌లు రెంట్ కు కావాలంటే మే 10 తర్వాతనే అంటోంది. అంతేకాదు అద్దెతోపాటు రాత్రి సమయంలో కూడా హెలీక్యాప్టర్‌లు రెంట్ కు తీసుకున్నవారి వద్దనే ఉండాలంటే మరో రూ.30వేలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అంతేనా ఇంకా ఉంది..హెలీక్యాప్టర్‌ల పైలట్‌ ఎకామిడేషన్, అతనికి సంబంధించిన ఇతర ఖర్చులు కూడా వారే భరించాలి. కాగా హెలీకాఫ్టర్ రెంట్ కు తీసుకునే విధానం అంతా ప్రతీదీ ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపులు జరిగిపోతున్నాయి. ఇదండీ ఎన్నికల వేళ హెలీకాఫ్టర్స్ కు ఉన్న డిమాండ్.