Elon Musk: ఎలన్ మస్క్‌కే ఆఫర్, ఇండియాకు తెస్తాడో.. లేదో

ఇండియాలో దిగుమతి పన్ను ఎక్కువగా ఉందని.. అది తగ్గిస్తేనే టెస్లా కార్లను ఇండియాకు తీసుకొస్తామని ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతూనే ఉంది. భారత ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌పై స్పందిస్తూ వస్తున్నారు.

Elon Musk: ఎలన్ మస్క్‌కే ఆఫర్, ఇండియాకు తెస్తాడో.. లేదో

Elon Musk

Elon Musk: ఇండియాలో దిగుమతి పన్ను ఎక్కువగా ఉందని.. అది తగ్గిస్తేనే టెస్లా కార్లను ఇండియాకు తీసుకొస్తామని ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ పై దుమారం రేగుతూనే ఉంది. భారత ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌పై స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా ఎలన్‌మస్క్‌కు గవర్నమెంట్ ఆఫీసర్ ఇచ్చిన ఆఫర్ ఇరుకున పడేలా చేసింది.

టెస్లా తమ కంపెనీ తయారుచేసిన కారును లగ్జరీ కారుగా పరిగణించవద్దంటూ.. కేవలం కాలుష్యం తగ్గే కారుగా పరిగణించి అనుమతి ఇవ్వాలని కోరింది. దానికి బదులిచ్చిన భారత ప్రభుత్వం.. దీనికి సంబంధించిన తయారీ ప్లాంట్‌ను భారత్ లో నెలకొల్పితేనే అనుమతి ఇచ్చి దిగుమతి పన్ను తగ్గించడానికి సిద్ధమేనని ఉన్నతాధికారి చెప్పినట్లు ఎకనామిక్ టైమ్స్ లో రాసుకొచ్చారు. కేవలం టెస్లా కారు ఒక్కదానికే కాకుండా అటువంటి కార్లన్నింటికీ వర్తిస్తుందని చెప్పింది.

విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్ ధర 40వేల డాలర్ల కంటే తక్కువ ఉంటే 60 శాతం పన్నుని విధిస్తుంది ప్రభుత్వం. అంతకంటే కారు ధర ఎక్కువగా ఉంటే వంద శాతం ట్యాక్స్ తప్పదు. ప్రస్తుతం టెస్లా ఎస్‌ ప్లెయిడ్‌ కారు ధర ఇండియన్ కరెన్సీలో కోటి రూపాయలలకు పైనే. దిగుమతి సుంకం కూడా కలిపితే కార్ ధర రెండు కోట్లు చేరినట్లే.

ఇండియాలో కార్ల తయారీ పరిశ్రమ పెడతామంటే పన్ను మినహాయింపు అంశం పరిశీలిస్తామంటూ టెస్లా ఓనర్‌ ఎలన్‌ మస్క్‌కు ఇచ్చిన ఆఫర్ తో ఏం చేస్తారో చూడాలి.