IIT-B study : కరోనా సోకి కోలుకున్న పురుషులకు పిల్లలు పుట్టరా ?

IIT-B (ఐఐటీ ముంబై)తో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. వైరస్ సోకిన పురుషుల్లో కొంతమందిపై అధ్యయనం...

IIT-B study : కరోనా సోకి కోలుకున్న పురుషులకు పిల్లలు పుట్టరా ?

Fertility In Men

Fertility In Men : భారతదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గతంలో లక్షలాదిగా కేసులు నమోదవుతుండడం.. మరణాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం వేలకు దిగువనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కానీ.. వైరస్ బారిన పడిన వారు ఇతర అనారోగ్యాలకు గురవుతుండడంతో వైద్యులు అధ్యయనాలు మొదలు పెట్టారు. ఓ స్టడీ మాత్రం అందర్నీ కలవర పెడుతోంది. కరోనా సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు. పురుషుల వీర్యకణాలను సేకరించి వాటిపై పరిశోధన చేసిందని గత వారం ACS Omega Journal ప్రకటించింది.

Read More : Corona 4th Wave: దేశంలో కరోనా నాలుగో దశ రానుందా?: నిపుణులు ఏమంటున్నారంటే

IIT-B (ఐఐటీ ముంబై)తో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. వైరస్ సోకిన పురుషుల్లో కొంతమందిపై అధ్యయనం నిర్వహించారు. 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సున్న 10 మంది పురుషుల వీర్యాన్ని, 17 మంది కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి వీర్యకణాలను సేకరించారు. నమూనాలను విశ్లేషించినట్లు అధ్యయనం నిర్వహించిన వారు తెలిపారు. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి చెందిన ప్రొటీన్లు దెబ్బతింటాయని తెలుసుకున్నారు. వైరస్ సోకడం వల్ల పురుషుల సంతానోత్పత్తి గణనీయంగా తగ్గుతుందని అధ్యయనంలో తేలినట్లు వెల్లడించారు. ఆరోగ్యవంతులైన వారి వీర్యకణాలతో పోల్చడం జరిగిందన్నారు. కరోనా బాధితుల్లో సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రొటీన్లు సెమెనోజెలిన్ 1, ప్రోసాపోసిన్ తక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

Read More : Corona Rising: పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు: ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశం

కరోనా ప్రపంచాన్ని వణికించేసింది. భారతదేశంలో ఎంతో మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఎంతోమంది చనిపోయారు. తమ కుటుంబీకులను కోల్పోయి తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ఈ వైరస్ చేసిన డ్యామెజ్ అంతాఇంతా కాదు. అయితే.. కరోనా బారిన పడి న కోలుకున్న వారు సైతం ఇప్పటికీ అనారోగ్యాలకు గురవుతున్నారు. ఎంతో మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొత్త వేరియంట్ల రూపంలో కలవర పెడుతోంది. పొరుగున ఉన్న చైనాతో సహా అమెరికా, ఐరోపా దేశాల్లో మరో దఫా విజృంభిస్తోందన్న సంగతి తెలిసిందే. కరోనా ముగింపు దశలో లేదని ఐరాస జనరల్ సెక్రటరీ బాంబు పేల్చారు. ప్రతి రోజు 15 లక్షల కరోనా కేసులు వస్తున్నట్లు, ఆసియాలో మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని, ఐరోపాలో కొత్త వేవ్ వ్యాపిస్తోందన్నారు.