UP SP : సైకిల్ బలంగా ఉంది – అఖిలేష్..ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య

అసెంబ్లీ ఎన్నికల కోసం తాము ఎదురు చూస్తున్నామని, అంబేద్కర్ వాదీ జత కలవడంతో ఎస్పీ బలంగా ఉందన్నారు...రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య మరికొందరు అఖిలేష్ యాదవ్ సమక్షంలో...

UP SP : సైకిల్ బలంగా ఉంది – అఖిలేష్..ఎస్పీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య

Sp Party

Ex UP Minister Swami Prasad Maurya : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన పలువురు నేతలు ఎస్పీ కండువా కప్పుకుంటున్నారు. ఇటీవలే రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య మరికొందరు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఎస్పీ పార్టీలో చేరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పార్టీకి ఉత్సాహం నింపే పరిణామంగా చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read More : Parrots Smuggling: రూ.1000 కోసం 140 రామచిలుకల అక్రమ రవాణా చేస్తున్న యువకుడు

ఈ సందర్భంగా బీజేపీ సర్కార్ పై అఖిలేష్ విమర్శల వర్శం గుప్పించారు. 2022, జనవరి 14వ తేదీ శుక్రవారం పార్టీ వర్చువల్ గా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. కాషాయ పార్టీలో ఉన్న ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని, క్రికెట్ ఆడడం తెలియకపోయినా…ఒకదాని వెంట ఒకటి పడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. స్వామి ప్రసాద్ మౌర్య ఎక్కడకు వెళ్లినా..ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ప్రస్తావించారు. భారీ సంఖ్యలో నేతలను ఎస్పీలో చేరిపించారని అభినందించారు. కాన్పూర్ లో వ్యాపారి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు విషయాన్ని గుర్తు చేశారు.

Read More : Train Derailed: రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి

డిజిటల్ ఇండియా లోపంగా ఆయన అభివర్ణించారు. రైడ్ ఎక్కడో జరగాల్సిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం తాము ఎదురు చూస్తున్నామని, అంబేద్కర్ వాదీ జత కలవడంతో ఎస్పీ బలంగా ఉందన్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ సైనీ, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే నీజ్ కుషావాహ మౌర్య, బీజేపీ మాజీ ఎమ్మెల్యే హర్పాల్ సైనీ, బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే బలరామ్ సైనీ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రతాప్ సింగ్, రాష్ట్ర మాజీ మంత్రి విద్రోహి మౌర్య, మాజీ చీఫ్ సెక్యూర్టీ ఆఫీసర్ పదమ్ సింగ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బన్సీసింగ్ పహాడియా సమాజ్ వాదీ పార్టీలో చేరారు.