Farmer Dream House : ఓడ ఆకారంలో ఇల్లు.. 13 ఏళ్లైనా పూర్తి కాని ఓ రైతు కలల సౌధం.. కారణం ఏంటంటే?

ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరికతో పాటు ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలి. ఓ రైతు ఎలాగైనా తన డ్రీమ్ హౌస్ నిర్మించుకోవాలి అనుకున్నాడు. అందుకోసం అతను పడుతున్న కష్టం చూస్తే ఇన్‌స్పైర్ అవుతాం.

Farmer Dream House : ఓడ ఆకారంలో ఇల్లు.. 13 ఏళ్లైనా పూర్తి కాని ఓ రైతు కలల సౌధం.. కారణం ఏంటంటే?

Farmer Dream House

Farmer Dream House : ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. తమ అభిరుచులకు తగ్గట్లుగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఓ రైతు (Farmer) తన డ్రీమ్ హౌస్ (dream house) కట్టడం ప్రారంభించాడు. 2010 లో నిర్మాణం మొదలైనా ఇప్పటికీ ఆ ఇల్లు పూర్తి కాలేదు. ఇంతకీ ఆ రైతు ఎవరు? ఇంకా అతని ఇల్లు ఎందుకు పూర్తి కాలేదు.. ఇంట్రెస్టింగ్ స్టోరి చదవండి.

Groceries on Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కిరాణా సామాన్లు తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో వైరల్

కోల్‌కతా (kolkata) నార్త్ 24 పరగణాస్‌లోని హెలెందా జిల్లాకు (Hellencha) చెందిన మింటురాయ్ (Mintu Roy) ఓ రైతు. అతనికి తన ఇంటిని ఓడలా (ship) నిర్మించుకోవడం అనేది కల. చిత్రంగా అనిపించినా ఇది నిజం. తన కల నిజం చేసుకుంటూ 2010 నుండి ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. 30 అడుగల పొడవు, 13 అడుగుల వెడల్పులో 30 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ఇంటి నిర్మాణం పనులు 13 సంవత్సరాలుగా ఇంకా పూర్తి కాలేదు. ఈ ఇంటి నిర్మాణం కోసం చాలామంది ఇంజనీర్లు (engineers) కూడా పని చేసారు. కానీ వారి పని తీరు మింటూకి నచ్చలేదు.

ఇక ఇల్లు కట్టడం అంటే ఆషామాషీ కాదు. శ్రమతో పాటు ఆర్ధికంగా కూడా బలంగా ఉండాలి. ఇప్పటి వరకూ ఆ ఇంటి మీద 15 లక్షల రూపాయల వరకూ ఖర్చుపెట్టాడు మింటూ. ఇక తానే స్వయంగా తాపీ పని నేర్చుకుని తన ఇల్లు నిర్మించుకోవాలని డిసైడ్ అయ్యాడు. అందుకోసం నేపాల్ వెళ్లి మూడేళ్ల పాటు తాపీ పని కూడా నేర్చుకున్నాడు. ఇక పంటల ద్వారా వచ్చిన డబ్బులో దాచిన మొత్తం ఇంటి పనులకు ఖర్చుపెట్టాడు.  పై అంతస్తులో ఓ రెస్టారెంట్  (restaurant) కూడా నిర్మించి 2024 కల్లా తన ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేయాలని మింటూ ఆశిస్తున్నాడు.

jail restaurant : బెంగళూరులో జైలును పోలిన రెస్టారెంట్ వీడియో వైరల్

ఇక తన సొంతింటికి తన తల్లి పేరు పెట్టాలని అనుకుంటున్నాడు మింటూ. పట్టుదల ఉంటే కానిది లేదు అంటారు. మింటూని చూస్తే అలాగే అనిపిస్తోంది. తన సొంతింటి కల నెరవేరడం కోసం 13 ఏళ్లుగా అతను పడుతున్న శ్రమ చూస్తే వచ్చే ఏడాదికి ఖచ్చితంగా తన సొంతిల్లు పూర్తి చేస్తాడు అనిపిస్తోంది. అతని కల నెరవేరాలని మనసారా కోరుకుందాం.