FIFA: ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం.. దేశంలో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నిర్వహణ డౌటే!

అఖిల భారత్ ఫుట్‌బాల్ సమాఖ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ నిర్వహణా సంస్థ ‘ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఫుట్‌బాల్ అసోసియేషన్’ ప్రకటించింది.

FIFA: ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం.. దేశంలో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నిర్వహణ డౌటే!

FIFA: ‘ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)’పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ నిర్వహణా సంస్థ ‘ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎప్ఐఎఫ్ఏ/ఫిఫా)’ సస్పెన్షన్ వేటు వేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

Shivamogga: ఇరువర్గాల మధ్య ఫ్లెక్స్ తెచ్చిన వివాదం.. శివమొగ్గలో 144 సెక్షన్

ఫిఫా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆగష్టు 15, సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో దేశంలో వచ్చే అక్టోబరులో నిర్వహించతలపెట్టిన అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహణ కూడా సందిగ్ధంలో పడింది. అక్టోబర్ 11-30 వరకు ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే, ఈ టోర్నీ ముందుగా ప్రకటించినట్లుగా జరిగే అవకాశం లేదని ఫిఫా కౌన్సిల్ తెలిపింది. దీనికి సంబంధించి అవసరమైతే తదుపరి చర్యల కోసం ఫిఫా బ్యూరో ఆఫ్ కౌన్సిల్‌కు రిఫర్ చేస్తామని హెచ్చరించింది.

Munugode: మునుగోడులో ఎన్నికల ఫీవర్.. నోటిఫికేషన్‌కు ముందే మారిన వాతావరణం

భవిష్యత్తులో ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలను చేపట్టేందుకు అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకున్నాకే ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తామని ఫిఫా ప్రకటించింది. మరోవైపు ఈ అంశంపై భారత క్రీడా మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రకటించింది.