Munugode: మునుగోడులో ఎన్నికల ఫీవర్.. నోటిఫికేషన్‌కు ముందే మారిన వాతావరణం

ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే మునుగోడులో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అప్పుడే ప్రచారం ప్రారంభించాయి. నేతల చేరికలు, ప్రచార రథాలతో అంతా ఎన్నికల సందడి నెలకొంది.

Munugode: మునుగోడులో ఎన్నికల ఫీవర్.. నోటిఫికేషన్‌కు ముందే మారిన వాతావరణం

Munugode: మునుగోడులో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ కూడా రాకముందే అక్కడ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు అప్పుడే ప్రచార పర్వాన్ని ప్రారంభించాయి. ఇటీవలే మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది.

Nitish Kumar: నేడు బిహార్ క్యాబినెట్ విస్తరణ.. ఆర్‌జేడీకే ఎక్కువ స్థానాలు

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. దీంతో నియోజకవర్గం మొత్తం ఎన్నికల హడావుడే కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు హోటళ్లు, ఫంక్షన్ హాళ్లను డిసెంబర్ వరకు బుక్ చేశాయి. నియోజకవర్గంలో ప్రచార రథాలు కూడా తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌లో అన్నింటికన్నా టీఆర్ఎస్ ముందుంది. ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా గురిపెట్టింది. నేతల చేరిక విషయంలో ఆశావహులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సభను సక్సెస్ చేసేందుకు టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను బాధ్యులుగా నియమించింది. మరోవైపు కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని స్థానిక టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.

Shivamogga: ఇరువర్గాల మధ్య ఫ్లెక్స్ తెచ్చిన వివాదం.. శివమొగ్గలో 144 సెక్షన్

స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండలాలవారీగా పర్యటిస్తున్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆయన కూడా చేరికలపై దృష్టిపెట్టారు. ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు పార్టీలో చేరేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. టీఆర్ఎస్ అసమ్మతి నేతలపై ఫోకస్ పెట్టారు. త్వరలో మండలాలవారీగా ఇంఛార్జ్‌లను బీజేపీ నియమించబోతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికపై దృష్టిసారించింది. ఈ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నిర్వహించిన సభ, పాదయాత్రతో పార్టీలో జోష్ కనిపిస్తోంది. నియోజకవర్గం మొత్తం మండలాలకు ఇంఛార్జ్‌లను నియమించారు. నేటి నుంచి వాళ్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగుతాయి.