Fire Blast in Rajasthan: భిల్వారా ఆయిల్ పరిశ్రమలో భారీ పేలుడు: రూ.60 లక్షల ఆస్తి నష్టం

రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంబవించింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించి పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Fire Blast in Rajasthan: భిల్వారా ఆయిల్ పరిశ్రమలో భారీ పేలుడు: రూ.60 లక్షల ఆస్తి నష్టం

Bhilwara

Fire Blast in Rajasthan: రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంబవించింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించి పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో కార్మికులు ఏంజరుగుతుందో తెలుసుకునేలోపే..భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పరిశ్రమ నుంచి కిలోమీటర్ పరిధిలో దట్టమైన పొగ ఆవరించినట్లు స్థానికులు పేర్కొన్నారు. నల్లటి పొగ, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. అగ్నిప్రమాదం పై సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు.. మొదట మూడు అగ్నిమాపక యంత్రాలతో ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

Also read: Husband Harassment : ప్రేమ పెళ్లి-ఆడ పిల్లలు పుట్టారని వదిలేసిన భర్త

అయినా మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో రెండు అగ్నిమాపక యంత్రాలను మరో ఆరు వాటర్ ట్యాంకులను తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. ఈప్రమాదంలో సుమారు రూ.60 లక్షల విలువైన సామాగ్రి దగ్దమైనట్లు అగ్నిమాపకశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సోమవారం నాడు రూ.50 లక్షల విలువైన ఆయిల్ కంటైనర్ ను పరిశ్రమకు తీసుకువచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆ కంటైనర్ పేలడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Also read: Fire Accident : ఒంగోలు ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు..పార్కింగ్ లో ఉన్న 9 బస్సులు దగ్ధం..