Firecracker Ban: ఢిల్లీలో దీపావళికి టపాసులపై నిషేధం.. కాలిస్తే రూ.200 ఫైన్.. అమ్మితే రూ.5 వేల ఫైన్

ఢిల్లీ పరిధిలో టపాసులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. తాజా నిబంధనల ప్రకారం.. టపాసులు కాల్చినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా రూ.200 నుంచి రూ.5,000 వరకు జరిమానాతోపాటు, జైలు శిక్ష విధిస్తారు.

Firecracker Ban: ఢిల్లీలో దీపావళికి టపాసులపై నిషేధం.. కాలిస్తే రూ.200 ఫైన్.. అమ్మితే రూ.5 వేల ఫైన్

Firecracker Ban: ఢిల్లీలో దీపావళికి టపాసులపై పూర్తి స్థాయి నిషేధం విధిస్తూ ఆప్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పరిధిలో ఎవరైనా టపాసులు కాలిస్తే రూ.200 జరిమానా విధించడంతోపాటు, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.

Arvind Kejriwal: కలిసి పనిచేద్దాం.. స్కూళ్లు బాగు చేద్దాం.. మోదీని కోరిన కేజ్రీవాల్

తాజా నిబంధనల ప్రకారం ఢిల్లీ పరిధిలో టపాసులు అమ్మడం, కలిగి ఉండటం, కాల్చడం పూర్తిగా నిషేధం. టపాసులు కాలిస్తే రూ.200 జరిమానా విధిస్తారు. ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా టపాసులు తయారు చేసినా, కలిగి ఉన్నా, అమ్మినా, రవాణా చేసినా రూ.5,000 జరిమానా విధించడంతోపాటు, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. సెక్షన్ 9బి, ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ ప్రకారం ఈ శిక్ష విధిస్తారు. అయితే, ఈ నిషేధం ఎప్పట్నుంచో అమలులో ఉంది. గతంలో తీసుకొచ్చిన ఈ రూల్‌ను వచ్చే ఏడాది జనవరి ఒకటి వరకు పొడిగించారు. కాగా, దీపావళి సందర్భంగా భారీ కార్యక్రమం నిర్వహించేందుకు ఆప్ సర్కారు ప్రయత్నిస్తోంది.

Mukesh Ambani: దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లా కొనుగోలు చేసిన ముకేష్ అంబానీ.. ధర ఎంతో తెలుసా!

వచ్చే శుక్రవారం స్థానిక సెంట్రల్ పార్కు పరిధిలో 51,000 దీపాల్ని వెలిగించనున్నారు. టపాసుల వల్ల కాలుష్యం పెరిగిపోతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటి. ఇప్పటికే ఈ నగరం కాలుష్యంతో సతమతమవుతోంది. టపాసుల వల్ల మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే రెండేళ్లుగా టపాసులపై నిషేధాన్ని అమలు చేస్తున్నారు.