Arvind Kejriwal: కలిసి పనిచేద్దాం.. స్కూళ్లు బాగు చేద్దాం.. మోదీని కోరిన కేజ్రీవాల్

దేశంలోని స్కూళ్లను కలిసి బాగు చేద్దామంటూ ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఒక స్కూల్‌ను సందర్శించారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ప్రధాని మోదీకి కేజ్రీవాల్ ఒక సూచన చేశారు.

Arvind Kejriwal: కలిసి పనిచేద్దాం.. స్కూళ్లు బాగు చేద్దాం.. మోదీని కోరిన కేజ్రీవాల్

Arvind Kejriwal: దేశంలోని స్కూళ్లను బాగు చేసేందుకు కలిసి పని చేద్దామని ప్రధాని మోదీని కోరారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని పాఠశాలలను తమ ఆప్ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దిందని, తమ అనుభవాన్ని వాడుకుని దేశంలోని ఇతర స్కూళ్లను కూడా అభివృద్ధి చేసేందుకు కలిసి పని చేద్దామని ప్రధానికి పిలుపునిచ్చారు కేజ్రీవాల్.

Solar Eclipse: ఈ నగరాల్లోనే సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో కనిపిస్తుందా? ఈసారి మిస్సైతే మళ్లీ పదేళ్ల తర్వాతే!

మోదీ ప్రస్తుతం గుజరాత్‌లోని, గాంధీ నగర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ అక్కడి ఒక స్కూలుకు వెళ్లి పరిశీలించారు. కాస్సేపు విద్యార్థులతో మాట్లాడారు. ఈ అంశంపై కేజ్రీవాల్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాల్ని వెల్లడించారు. అక్కడి విద్యార్థులతో మోదీ కలిసున్న ఫొటోను కూడా కేజ్రీవాల్ షేర్ చేశారు. ‘‘మోదీ సార్.. విద్యారంగంలో ఢిల్లీలోని మా సర్కారు అద్భుతంగా పని చేస్తోంది. ఐదేళ్లలో ఢిల్లీ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లు గణనీయంగా అభివృద్ధి చెందాయి. అలాగే ఐదేళ్లలో దేశంలోని స్కూళ్లను అభివృద్ధి చేయొచ్చు. ఈ రంగంలో మా ప్రభుత్వానికి ఎంతో అనుభవం ఉంది. మా అనుభవాన్ని వాడుకోండి. దేశం కోసం కలిసి పనిచేద్దాం.

Delhi Woman: మహిళను ఎత్తుకెళ్లి ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన

దేశంలోని విద్యా వ్యవస్థపై, స్కూళ్లపై పార్టీలు, ప్రభుత్వాలు చర్చిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది మేం సాధించిన ఘనత. అన్ని ప్రభుత్వాలు కలిసి ఐదేళ్లోలో దేశంలోని స్కూళ్లను డెవలప్ చేయాలి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.