నిర్మలా సీతారామన్ స్పీచ్ హైలెట్స్

  • Published By: Subhan ,Published On : May 13, 2020 / 12:45 PM IST
నిర్మలా సీతారామన్ స్పీచ్ హైలెట్స్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రూ.20లక్షల కోట్ల ఎకానమీ ప్యాకేజీపై పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రధాని మంగళవారం ప్రకటించిన ప్యాకేజీని వివరించారు. మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs)లను ప్రాధాన్యత ఇస్తూ ప్రసంగించారు. 

సమానమైన సపోర్ట్ అందిస్తూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలకు 20వేల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

దేశంలోని 10శాతం జీడీపీని ప్రధాని మోడీ మంగళవారం తెలిపారు. ఈ ప్యాకేజీ ప్రకటించడంతో మరుసటిరోజే స్టాక్ మార్కెట్లలో మార్పు కనిపించింది. BSE, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE)4శాతం లాభాలతో ఆరంభమైయ్యాయి. 

సెల్ఫ్ రిలయంట్ ఇండియా వృద్ధి చేసే దిశగా పాటుపడాలని అందుకే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ను తీసుకొస్తున్నామని అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి, పలువురిని సంప్రదించి సమాజం స్థితిగతులను బట్టి నిర్ణయం తీసుకున్నారు. 

ఐసోలేషన్ లో గడిపితే ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఇండియా అవదు. ఇండియా కాన్ఫిడెంట్ కంట్రీ అయితేనే అది సాధ్యమవుతుంది. 

41కోట్ల మంది జన్ ధన్ అకౌంట్ హోల్డర్లకు రూ.52వేల 606 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశాం. రూ.18వేల కోట్ల ధాన్యం పంపిణీ చేశాం. ఉజ్వల, దివ్యాంగులు, వృద్ధులు దీని వల్ల లబ్ధి పొందారు. 

ఇవాల్టి నుంచి మరో 5రోజులు ప్రధాని చెప్పినట్లుగా సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా భారత్ ను తీర్చిదిద్దేందుకు మీ ముందుకు వస్తూనే ఉంటాం. 

మనం పేదల పట్ల బాధ్యత వహించాలి. వలస కార్మికుల అవసరాలు తీర్చాలి. దివ్యాంగులు, వృద్ధులకు సాయం చేయాలి. 

ఉచితంగా MSMEs రుణాలు ఇస్తున్నాం. దీని కోసం రూ.3లక్షల కోట్లు కేటాయించాం. 2020 అక్టోబరు 31వరకూ వీటిని తీసుకోవచ్చు. వీటి గడువు 4సంవత్సరాలు. 

20వేల కోట్ల రుణాలు ఇవ్వనుండటంతో రెండు లక్షల MSMEsలు లబ్ధి పొందుతాయి. దీంతో పాటు మా ప్రభుత్వం CGTMSEకు 4వేలు ఇవ్వనున్నాం. 

ప్రభుత్వమే టెండర్లు వేస్తుంది కానీ, ఇతరులకు అవకాశం ఇవ్వం. ఇది కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగమే. 

ఆర్థికపరమైన ఒత్తిడి తీర్చేందుకు ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకునేందుకు వీలుగా రూ.2వేల 500కోట్లు కేటాయించాం. 

ప్రభుత్వం రూ.30వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ స్కీంను లాంచ్ చేస్తుంది. దీంతో ప్రైమరీ, సెకండరీ మార్కెట్లు పెట్టుబడులను రుణాల కింద పొందొచ్చు. 

డిస్కంలకు నగదు సమస్యలు వచ్చి పడ్డాయి. అన్నీ రాష్ట్రాల్లోనూ సంక్షోభంలో ఉన్నాయి. వాటిని కాపాడేందుకు రూ.90వేలు ఇవ్వనున్నాం. 

అన్ని సెంట్రల్ ఏజెన్సీల నుంచి కాంట్రాక్టర్లకు మరో 6నెలల గడువు పెంచుతున్నాం. 

నాన్ స్పెసిఫైడ్ పేమెంట్స్ కోసం ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (టీడీఎస్), ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్) 25 శాతం తగ్గించనున్నాం. 

2019-20ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ లను 31 జులై  2020వరకూ, 31 అక్టోబరు, 30 నవంబరు వరకూ పొడిగించాం. ట్యాక్స్ ఆడిట్ ను 2020 సెప్టెంబరు 30ను, అక్టోబరు 31న నిర్వహిస్తాం. 

వివాద్ సే విశ్వాస్ స్కీం పీరియడ్ ఎటువంటి పెనాల్టీ లేకుండా 2020 డిసెంబరు 31వరకూ పొడిగించామని సీతారామన్ అన్నారు