Indira Gandhi to be PM : అల్ప్ పర్వతాలపై 1966 భారతీయ న్యూస్ పేపర్స్

  • Published By: madhu ,Published On : July 14, 2020 / 11:56 AM IST
Indira Gandhi to be PM : అల్ప్ పర్వతాలపై 1966 భారతీయ న్యూస్ పేపర్స్

1966 నాటి భారతీయ వార్త పత్రికలు French Alps పర్వతాాలపై బయటపడడం సంచలనం రేకేత్తిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ పత్రికలు 1966 జనవరి, 24వ తేదన కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ఉన్నాయని భావిస్తున్నారు.

ఈ విమాన ప్రమాదంలో 117 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. దొరికిన పత్రికల్లో National Herald and the Economic Times తో సహా దాదాపు 12 దాక ఉన్నాయని సమాచారం. ఫస్ట్ పేజీలో ఇందిరాగాంధీ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన వార్తలున్నాయి. India First Women Prime Minister అంటూ వార్తలు ప్రచురించారు.

స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్ యజమానికి ఈ పేపర్లు దొరికాయి. దొరికిన పేపర్లు తడిచినట్లుగా కనిపిస్తున్నాయి. కానీ చదివేందుకు వీలుగానే ఉన్నాయని చామోనిక్స్ స్కీ రిసార్ట్ పక్కనే రెస్టారెంట్ నడుపుతున్న టిమోతీ మాటిన్ వెల్లడించారు. తాను కనుగొన్న మిగత వస్తువులు, ఈ పత్రికలను రెస్టారెంట్ లో ప్రదర్శిస్తానని అంటున్నారు.

ముంబై నుంచి లండన్ వెళుతున్న Air India flight 101 (1966 జనవరి 24వ) తేదీన ప్రయాణిస్తోంది. ఢిల్లీ, లెబనాన్ బీరూట్ లో రెండుసార్లు ఆగింది. స్విట్జర్లాండ్ లోని జెనివాలో దిగుతున్న సమయంలో మాంట్ బ్లాంక్ శిఖరం వద్ద కూలిపోయింది. విమానంలో ఉన్న 106 మంది ప్యాసింజర్స్, 11 మంది సిబ్బంది చనిపోయారు.