Uttar Pradesh: యూపీలో మరో భారీ ఎన్కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను హతమార్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
పలు కేసుల్లో హాజరుకాకపోవడంతో కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. బాదల్పూర్ కోర్టు దుజానాకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా, అనిల్ దుజానాపై మొదటి కేసు 2002లో నమోదైంది. తర్వాత, అతను నరేష్ భాటి గ్యాంగ్‌లో చేరాడు

Gangster Anil Dujana
Uttar Pradesh: మాజీ ఎంపీ, మాఫియా డాన్ అతీక్ అహ్మద్ ఎన్కౌంటర్ మరువక ముందే ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో మరో గ్యాంగ్‌స్టర్ మీద ఎన్కౌంటర్ జరిగింది. భయంకరమైన గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానా(Gangster Anil Dujana)ను ఆ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ (STF) పోలీసులు గురువారం మధ్యాహ్నం మట్టుబెట్టారు. గౌతమ్ బుద్ధ నగర్ (Goutham buddha nagar) జిల్లాలోని బదలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుజానా గ్రామానికి చెందిన వ్యక్తి అనిల్ దుజానా. వాస్తవానికి ఇతడి అసలు పేరు అనిల్ నగర్ (Anil Nagar). ఇతడిపై 62 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 18 కేసులు అత్యంత తీవ్రమైన నేరాలకు సంబంధించినవి.
Bihar: నితీశ్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై స్టే విధించిన హైకోర్టు
పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన అనిల్ దుజానాపై హత్యలు, దోపిడీలు, భూదందా, కిడ్నాప్ వంటి అనేక తీవ్ర నేరాలు లాంటి అనేకం ఉన్నాయి. రాష్ట్రంలోని మాఫియాను మట్టిలో కలిపేస్తానని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శపథం చేశాను. ఆయన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్కౌంటర్ అనంతరం, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేసిన రెండవ పెద్ద ఎన్కౌంటర్ ఇదే.
డిసెంబర్ 2022లో అనిల్ దుజానాను ఢిల్లీ పోలీసులు మయూర్ విహార్ ప్రాంతంలో అరెస్టు చేశారు. దుజానా తలపై రూ.50,000 రివార్డు ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో అనిల్ దుజానా ఉన్నాడు. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ), గూండా యాక్ట్‌తో సహా పలు అభియోగాల్లో ఆయనపై కేసులు నమోదు చేశారు. పలు కేసుల్లో హాజరుకాకపోవడంతో కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. బాదల్పూర్ కోర్టు దుజానాకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా, అనిల్ దుజానాపై మొదటి కేసు 2002లో నమోదైంది. తర్వాత, అతను నరేష్ భాటి గ్యాంగ్‌లో చేరాడు. సుందర్ భాటిని నరేష్ భాటి చంపి తనకు తాను డాన్ గా ప్రకటించుకున్నాడు.