Gita Press: గాంధీ శాంతి బహుమతితో వచ్చే కోటి రూపాయల నగదు బహుమానాన్ని తిరస్కరించిన గీతా ప్రెస్

గాంధీ శాంతి బహుమతిని మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో స్థాపించారు. మహాత్మా గాంధీ ప్రతిపాదిస్తున్న ఆదర్శాలకు నివాళిగా ప్రతి ఏడాది ఈ అవార్డు ప్రకటిస్తారు. ఈ అవార్డు జాతీయత, జాతి, భాష, కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అందరికీ ఇస్తారు

Gita Press: గాంధీ శాంతి బహుమతితో వచ్చే కోటి రూపాయల నగదు బహుమానాన్ని తిరస్కరించిన గీతా ప్రెస్

Updated On : June 19, 2023 / 5:48 PM IST

Gandhi Peace Prize Honour: ప్రపంచంలోన అతిపెద్ద పబ్లిషర్లలో ఒకటైన గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్.. 2021 గాంధీ శాంతి బహుమతికి గానూ 1 కోటి రూపాయల నగదు బహుమతిని స్వీకరించడానికి నిరాకరించింది. గీతా ప్రెస్‌ను అవార్డు గ్రహీతగా ఎంపిక చేస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఆదివారం ఏకగ్రీవంగా నిర్ణయించింది. “గీతా ప్రెస్, గోరఖ్‌పూర్‌కు గాంధీ శాంతి బహుమతి 2021 లభించినందుకు నేను అభినందిస్తున్నాను. వారు గత 100 సంవత్సరాలుగా ప్రజలలో సామాజిక, సాంస్కృతిక పరివర్తనలను పెంపొందించడంలో ప్రశంసనీయమైన కృషి చేశారు” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ట్వీట్ చేశారు.

Ballia Hospital: తాజాగా మరో 14 మంది మృతి.. బలియా ఆసుపత్రిలో పెరుగుతున్న మరణాలు, వేడిగాలులకు 4 రోజుల్లో 68 మంది మృతి

అయితే తాము కేవలం ఉల్లేఖనాన్ని మాత్రమే అంగీకరిస్తామని, రివార్డ్ కింద వచ్చే నగదును ప్రభుత్వం మరే దేనికైనా ఖర్చు చేయాలని గీతా ప్రెస్ సూచించింది. ఈ అవార్డులో ఫలకంతో పాటు సున్నితమైన సాంప్రదాయ హస్తకళ, చేనేత వస్తువు ఉన్నాయి. అయితే గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమని, సావర్కర్, గాడ్సేకి అవార్డు ఇవ్వడమని ఘాటుగా స్పందించింది.

Viral Video: గ్రాడ్యుయేషన్ పాసైన ఆనందతో డాన్స్ చేసింది.. అదే ఆమె కొంప ముంచింది

గాంధీ శాంతి బహుమతిని మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో స్థాపించారు. మహాత్మా గాంధీ ప్రతిపాదిస్తున్న ఆదర్శాలకు నివాళిగా ప్రతి ఏడాది ఈ అవార్డు ప్రకటిస్తారు. ఈ అవార్డు జాతీయత, జాతి, భాష, కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అందరికీ ఇస్తారు. ఇటీవలి అవార్డు గ్రహీతల్లో 2019లో ఒమన్ దేశానికి చెందిన సుల్తాన్ ఖబూస్ బిన్ సైద్ అల్ సైద్, బంగ్లాదేశ్‌లోని బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ (2020)కు ఇచ్చారు.