Goa Congress : గోవాలో కాంగ్రెస్ కి బిగ్ షాక్..మాజీ సీఎం రాజీనామా..టీఎంసీలో చేరిక

గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్​ పార్టీకి ఆ రాష్ట్రంలో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే లుయీజిన్హో ఫలేరో(70) కాంగ్రెస్ పార్టీ

Goa Congress : గోవాలో కాంగ్రెస్ కి బిగ్ షాక్..మాజీ సీఎం రాజీనామా..టీఎంసీలో చేరిక

Goa

Goa Congress  గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్​ పార్టీకి ఆ రాష్ట్రంలో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే లుయీజిన్హో ఫలేరో(70) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా ఫలేరో రాజీనామా చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ లో కొనసాగిన ఫలేరో తన రాజీనామా లేఖలో… గోవాలో ఇప్పుడున్న కాంగ్రెస్ తాము త్యాగం చేసి మరియు పోరాడిన పార్టీ కాదు అని సోనియాగాంధీనికి తెలిపారు 13మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోతే..ఇప్పటిదాకా ఒక్కరూ కూడా దానికి బాధ్యత వహించలేదని.. కాంగ్రెస్ పై పూర్తిగా ఆశలు లేవని..పార్టీ పతనాన్ని నిరోధించడానికి ఎలాంటి చర్యలు లేవని తెలిపారు. కాంగ్రెస్ గోవా యూనిట్ పార్టీ అంటే “క్రూరమైన పేరడీ” గా మారిందని ఆయన అన్నారు.

ఫలేరో నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గోవా రాజకీయాల్లో ఫలేరో బలమైన నేత. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నవేలిమ్​ నుంచి ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు. మిజోరాం, మేఘాలయా, అరుణాచల్​ప్రదేశ్, మణిపుర్​లలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడానికి వ్యూహాలు, పొత్తుల వెనుక ఫలేరోదే కీలకపాత్ర. 2013లో కర్ణాటక ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్​గానూ ఆయన వ్యవహరించారు. గోవా ఎన్నికల సమన్వయ కమిటీకి ఈ వారమే ఫలేరోను అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్.

2017 గోవా శాసనసభ ఎన్నికల్లో మొత్తం 40 స్థానాలకు గానూ కాంగ్రెస్ అత్యధికంగా 17 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీకి 13 స్థానాలు దక్కాయి. అయితే స్థానిక పార్టీలతో పొత్తుతో మనోహర్ పారికర్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్​కు షాకిచ్చింది కమలం పార్టీ. ఫిరాయింపుల అనంతరం మరియు తాజాగా ఫలేరో నిష్క్రమణతో ప్రస్తుతం కాంగ్రెస్​లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. 2012 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో లేదు.

అయితే లుయీజిన్హో ఫలేరో టీఎంసీలో చేరనున్నట్లు సమాచారం. బుధవారం ఆయన టీఎంసీలో చేరతారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ముందు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఫలేరో ప్రశంసలు కురిపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీని ఢీకొనే స‌త్తా ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఒక్క‌రికే ఉంద‌ని లుజిన్హో ఫ‌లీరో స్ప‌ష్టం చేశారు. ఇక, వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఎంసీ పోటీ చేస్తుంద‌ని, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని ఇటీవ‌ల గోవా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ప్ర‌క‌టించారు.

ALSOR READ గోవాపై టీఎంసీ కన్ను..రంగంలోకి పీకే..రా రమ్మంటున్న సీఎం సావంత్