New IT rules: గూగుల్, ఫేస్‌బుక్ అప్‌డేట్.. ఐటీశాఖకు వివరాలు ఇస్తున్నాయి

గూగుల్, ఫేస్‌బుక్ వంటి పెద్ద డిజిటల్ మీడియా కంపెనీలు తమ వెబ్‌సైట్లను అప్‌డేట్ చేయడం ప్రారంభించాయి. భారత కొత్త సోషల్ మీడియా నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదు అధికారులను సదరు సంస్థలు నియమించాయి.

New IT rules: గూగుల్, ఫేస్‌బుక్ అప్‌డేట్.. ఐటీశాఖకు వివరాలు ఇస్తున్నాయి

New It Rules

Google, Facebook updating website: గూగుల్, ఫేస్‌బుక్ వంటి పెద్ద డిజిటల్ మీడియా కంపెనీలు తమ వెబ్‌సైట్లను అప్‌డేట్ చేయడం ప్రారంభించాయి. భారత కొత్త సోషల్ మీడియా నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదు అధికారులను సదరు సంస్థలు నియమించాయి. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి పెద్ద కంపెనీలు కొత్త డిజిటల్ నిబంధనల ప్రకారం సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ(ఐటి)తో వివరాలను పంచుకున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ట్విట్టర్ మాత్రం ఇప్పటికీ నిబంధనలను పాటించట్లేదు.

కొత్త నిబంధనల ప్రకారం, ప్రధాన సోషల్ మీడియా సంస్థలు గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లను నియమించాల్సిన అవసరం ఉంది. 5 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ప్రధాన సోషల్ మీడియా సంస్థలు ఈ వర్గంలోకి వస్తాయి.

ఫేస్‌బుక్, వాట్సాప్‌లు ఇప్పటికే ఇందుకు సంబంధించిన నివేదికను ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖతో పంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఫిర్యాదు అధికారుల నియామకం గురించి సమాచారంను సమాచార మంత్రిత్వశాఖ చూస్తుంది. నిబంధనల ప్రకారం, అన్ని సోషల్ మీడియా సంస్థలు తమ వెబ్‌సైట్, యాప్ లేదా రెండింటిలో ఫిర్యాదు పరిష్కార అధికారి మరియు వారి చిరునామా గురించి సమాచారాన్ని అందించాలి. అలాగే, ఫిర్యాదు చేసే పద్ధతిని యూజర్లు లేదా బాధితులు తమకు ఫిర్యాదు ద్వారా చెప్పవచ్చు.