Colleageum Vs Govt : న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాల జోక్యం అవసరమా? న్యాయశాఖా మంత్రి లేఖపై సుప్రీం కోర్టు ఎలా స్పందించనుంది?

న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్‌ వర్సెస్‌ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని భారత ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయ శాఖా మంత్రి రాసిన లేఖతో కొన్నేళ్లుగా కొనసాగుతున్న గొడవ మళ్లీ చర్చనీయాంశంగా మారిన క్రమంలో అసలేంటీ కొలీజియం? అత్యున్నత న్యాయస్థానాల జడ్జి నియామక ప్రక్రియలో పారదర్శకత.. జవాబుదారీతనం లేవా? కేంద్రం చెబుతున్న వాదనేంటి? కేంద్రం ఏం చేయాలనుకుంటోంది? న్యాయశాఖా మంత్రి లేఖపై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుంది?

Colleageum Vs Govt : న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వాల జోక్యం అవసరమా? న్యాయశాఖా మంత్రి లేఖపై సుప్రీం కోర్టు ఎలా స్పందించనుంది?

governments interfere in the selection process of judges_

Colleageum Vs Govt : న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన కొలీజియం విషయంలో సుప్రీం కోర్ట్‌ వర్సెస్‌ కేంద్రం వివాదం మళ్లీ తెరమీదికొచ్చింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని భారత ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయ శాఖా మంత్రి రాసిన లేఖతో కొన్నేళ్లుగా కొనసాగుతున్న గొడవ మళ్లీ చర్చనీయాంశంగా మారిన క్రమంలో అసలేంటీ కొలీజియం? ఇప్పుడెందుకీ వివాదం? అత్యున్నత న్యాయస్థానాల జడ్జి నియామక ప్రక్రియలో పారదర్శకత.. జవాబుదారీతనం లేవా? కేంద్రం చెబుతున్న వాదనేంటి? కేంద్రం ఏం చేయాలనుకుంటోంది? కేంద్ర న్యాయశాఖా మంత్రి లేఖతో చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా ఏం చేయబోతున్నారు? ఇప్పుడిదే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కొలీజియం వ్యవస్థలో మార్పులు న్యాయవ్యవస్థలో పారదర్శకత కోసమేనని కేంద్రం చెబుతోంది కేంద్రం. దీన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు.. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు.. బదిలీలకు సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించే వ్యవస్థే కొలీజియం. ఇందులో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సహా మరో నలుగురు సీనియర్‌ మోస్ట్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. హైకోర్టులో చీఫ్‌ జస్టిస్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు కొలీజియంలో సభ్యులుగా ఉంటారు. కొలీజియం న్యాయమూర్తుల నియామకం.. బదిలీలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. కొలీజియం ఒక పేరును రెండుసార్లు సిఫార్సు చేస్తే ఆమోదించాల్సిందేనని గతంలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Colleageum Vs Govt : కొలీజియంపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలేంటి? కొలీజియంలో జవాబుదారీతనం.. పారదర్శకత లోపించాయా?

అయితే.. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ఈ కొలీజియం వ్యవస్థలో సమూల మార్పులకు సిద్ధమైంది. కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం.. పారదర్శకత కొరవడిందని చెబుతూ రాజ్యాంగ సవరణ చేసి మరీ నేషనల్‌ జ్యుడీషియరీ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌ ఎన్‌జేఏసీని ప్రతిపాదించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులతో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి.. పౌర సమాజం నుంచి మరో ఇద్దరు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా చేర్చుతూ ఎన్‌జేఏసీని ప్రతిపాదించింది కేంద్రం. సుప్రీం కోర్టు.. హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పిస్తూ ప్రతిపాదనలు చేసింది . సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక కమిటీలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులకు.. హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకు చోటు కల్పించాలని ప్రతిపాదించింది కేంద్రం.

ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. కొలీజియం స్థానంలో కేంద్రం ప్రతిపాదించిన ఈ కమిషన్‌లో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అత్యున్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తులను నియమించే వ్యవస్థలో ప్రభుత్వ పెద్దల ప్రమేయమేంటనే విమర్శలు కూడా వచ్చాయి. కేంద్రం ప్రతిపాదనలను అత్యున్నత న్యాయస్థానం కూడా తోసిపుచ్చింది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత.. జవాబుదారీతనం కొరవడితే కొలీజయం వ్యవస్థతో చర్చించి.. ఎంపిక ప్రక్రియ మెమొరాండమ్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ మార్గదర్శకాలను రూపొందించాలని సూచించింది. ఎన్‌జేఏసీ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. దీంతో కొలీజియం వర్సెస్‌ కేంద్రంగా మారింది వ్యవహారం.

కొలీజియం వ్యవస్థకు జవాబుదారీతనం లేకుండా పోయిందని.. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని చెబుతోన్న కేంద్రం.. అందుకు జస్టిస్‌ కర్ణన్ వ్యవహారాన్ని ఉదాహరణగా చూపించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సహా పలువురిపై అవినీతి ఆరోపణలు చేసిన అప్పటి పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కర్ణన్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఏకంగా సుప్రీం న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడమే కాకుండా.. న్యాయమూర్తులకు జైలు శిక్షలు విధించి కలకలం రేపారు. దళితుడిననే తనపై వివక్ష చూపుతున్నారని కూడా కర్ణన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ హైకోర్టు న్యాయమూర్తి సుప్రీం కోర్టు జడ్జిలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. వారికి జైలు శిక్షలు విధించడం.. న్యాయమూర్తులపై కులవివక్ష వ్యాఖ్యలు.. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో లోపాలుగానే పరిగణించాలంటోంది కేంద్రం. ఇలాంటి ఘటనల నేపథ్యంలో న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో కొన్ని మార్గదర్శకాలను స్ట్రిక్ట్‌గా ఫాలో చేయాల్సిందేనని కేంద్రం చెబుతోంది. నియామక ప్రక్రియ జరుగుతున్నప్పుడే వారి అనుభవం.. ప్రవర్తన.. వంటి విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని.. కేవలం జుడీషియరీకి సంబంధించిన వ్యక్తులే ఎంపిక ప్రక్రియలో ఉండాల్సిన అవసరం లేదనేది కేంద్రం వాదన.

అయితే.. న్యాయస్థానాలకు రాజ్యాంగం ప్రత్యేక అధికారాలను కల్పించిందని.. సామాన్యులతో పాటు ప్రభుత్వ పెద్దల వరకూ అందరినీ సమానంగా చూస్తూ న్యాయం చెప్పాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉంటుందన్నారు జస్టిస్‌ చంద్రకుమార్. నేడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. అర్హులు.. నిజాయతీపరులను ప్రతి వ్యవస్థలో నియమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ప్రతిపాదనలతో జడ్జిల నియామకంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనుకుంటోందన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ప్రతినిధుల చేరికతో ఎంపిక ప్రక్రియలో జవాబుదారీతనం.. పారదర్శకత పెరుగుతాయా? అసలు న్యాయవ్యవస్థలో ప్రభుత్వాలు ఎందుకు జోక్యం చేసుకోవాలనుకుంటున్నాయనే అనుమానాలు కూడా లేవనెత్తాయి. తాజాగా కేంద్ర మంత్రి రిజిజు రాసిన లేఖతో సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.