కరోనా వ్యాక్సిన్‌పై ముందుచూపు లేకపోవడం ఆందోళనకరం..రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : August 27, 2020 / 03:55 PM IST
కరోనా వ్యాక్సిన్‌పై ముందుచూపు లేకపోవడం ఆందోళనకరం..రాహుల్

దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 33 లక్షల మందికి పైగా వైరస్ వ్యాప్తించినా.. ప్రభుత్వం ఇప్పటికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురాలేకపోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే సమగ్ర వ్యాక్సిన్‌ విధానాన్ని రూపొందించి, అనుసరించాల్సి ఉండగా…ఆ దిశగా చర్యలు కనుచూపు మేరలో కనపడటం లేదని విమర్శించారు.



కరోనా ‌వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పాటికే సక్రమమైన, అందరినీ కలుపుకునే విధంగా వ్యూహాన్ని అనుసరించి ఉండాలి. కానీ, ఇప్పటికీ ఆ సూచనలు లేవు. భారత ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం ఆందోళనకరం అని రాహుల్ ట్వీట్ చేశారు.
https://10tv.in/tamilnadu-police-men-appeal-to-yama-dharmaraja-for-extended-of-lifespan/
కాగా, భారత్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉత్తత్తి చేసే సామర్థ్యమున్న దేశమని, వ్యాక్సిన్‌ను అందుబాటు తెచ్చేందుకు, సక్రమంగా పంపిణీ చేసేందుకు.. స్పష్టమైన, సమదృష్టిగల వ్యూహాన్ని రూపొందించి, అనుసరించాలని గతంలో తాను చేసిన ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ ను కూడా రాహుల్ ఇప్పుడు షేర్ చేశారు.



అయితే, భారత్‌ కొవిడ్‌ రేసులో ముందుందని.. 2020 చివరిలోగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ఇటీవల ప్రకటించారు. అంతేకాకుండా, మూడు కొవిడ్‌-19 వ్యాక్సిన్లు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) మంగళవారం ప్రకటించింది.