Viral Pic : వధువుకు పాదాభివందనం చేసిన వరుడు..

పెళ్లిలో వధువు వరుడి పాదాలకు దణ్ణం పెట్టటం సంప్రదాయం..ఇది సర్వసాధారణంగా జరిగేదే.కానీ ఓ వరుడు మాత్రం వధువు కాళ్లకు దణ్ణం పెట్టాడు. దానికి అతను చెప్పిన కారణాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Viral Pic : వధువుకు పాదాభివందనం చేసిన వరుడు..

Groom

Groom touching his brides feet : పెళ్లి వేడుకలో వధువుతో వరుడికి కాళ్లకు దణ్ణం పెట్టించే సందర్భాలు చాలానే ఉంటాయి. మంగళసూత్రంకట్టినప్పుడు. అక్షింతలు వేసినప్పుడు. గౌరీ పూజలోను..పూల దండలు మార్చుకున్నప్పుడు.. ఇలా పలుమార్లు వధువు వరుడి కాళ్లకు దణ్ణం పెడుతుంది. ఇది సంప్రదాయం అంటారు. కానీ నేటి యువత సంప్రదాయాలకు చెల్లుచీటి ఇస్తూ వధువుతో తాళి కట్టించుకోవటం..కాళ్లకు దణ్ణం పెట్టటం చేస్తున్నారు. ఇద్దరూ సమానమేనంటున్నారు. ఇది చాలా మంచి పరిణామమే.కానీ కేవలం పెళ్లిలో అలా చేసి తరువాత ఇద్దరం సమానమే అన్నట్లుగా ఉంటారా? లేదా? అనేది విషయం పక్కనపెడితే…ఎంతోమంది బంధుమిత్రుల మధ్య వధువు కాళ్లకు దణ్ణం పెట్టటం..తాళికట్టించుకోవటం అనేది చాలా చాలా వైవిధ్యమనే చెప్పాలి.

అలా ఓ వరుడు వధువుతో తాళి కట్టించుకున్న ఘట్టం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అలాంటి మరో వరుడు వధువు కాళ్లకు దణ్ణం పెట్టి వైరల్ అయ్యాడు. వేదమంత్రోఛ్చారణ మధ్య జరిగిన ఈ వివాహంలో వధూవరులు దండలు మార్చుకున్న అనంతరం పెళ్లి కొడుకు అనూహ్యంగా పెళ్లి కూతురికి కాళ్లకు నమస్కారం పెట్టాడు. అది చూసి పెళ్లికొచ్చిన బంధువులు, వధూవరుల స్నేహితులు, శ్రేయోభిలాషులు షాక్ అయ్యారు. సర్వసాధారణంగా జరిగే సంప్రదాయానికి భిన్నంగా ఓ కొత్త ఒరవడికి తెర తీసిన పెళ్లికొడుకు వధువు కాళ్లకు దణ్ణం పెట్టిన వైనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దానికి సదరు వరుడు కూడా చాలా డిఫరెంట్ గానే స్పందించాడు.వధువు కాళ్లకు దణ్ణం పెట్టటానికి ఒకటీ రెండూ కాదు ఏకంగా తొమ్మిది కారణాలున్నాయంటున్నాడు. వీటిలో మొదటిది..తన వంశాన్ని అభివృద్ధి చేయటానికి వచ్చే ఆమెకు దణ్ణం పెట్టటం తన బాధ్యతగా భావించానని తెలిపారు. అలాగే తన జీవితంలో సంతోషాన్ని తెచ్చే భార్యకు దణ్ణం పెడితేతప్పేంటి అంటూ ప్రశ్నించాడు.

కన్నవారిని..తన బంధువుల్ని వదిలి తనతో మూడు ముళ్లు వేయించుకుని తనకు భార్య అయ్యి తన వారినందరినీ విడిచిపెట్టి భర్త కోసం మరోఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన భార్యకు ఆ మాత్రం గౌరవం ఇవ్వాలని ఇది ఆమెకు నేనిచ్చే గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టి..వరుడు పాదాభివందనం చేసిన దృశ్యాన్ని షేర్ చేశాడు. ఈ ఫోటోతో పాటు సదరు వరుడు చెప్పిన కారణాలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి.